Balakrishna.. సాధారణంగా హీరోలు, హీరోయిన్లు అంటే అభిమానులకే కాదు సెలబ్రిటీలకు కూడా ఇష్టమైన వాళ్లు ఉంటారనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే వేలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న నటసింహా నందమూరి బాలకృష్ణ(Balakrishna)కి కూడా ముగ్గురు హీరోయిన్లు అంటే చాలా ఇష్టమట. మరి బాలయ్యకు ఫేవరెట్ హీరోయిన్స్ గా మారిన ఆ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
అన్నయ్యకు పద్మభూషణ్.. గ్రాండ్ పార్టీ ఇచ్చిన సీఎం భార్య..
నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘అఖండ 2’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది అటు కెరియర్ పరంగా ఇటు వ్యక్తిగతంగా సక్సెస్ లు అందుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ‘డాకు మహారాజ్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య మరొకవైపు ‘పద్మభూషణ్’ అవార్డు సొంతం చేసుకోనున్నారు. త్వరలోనే రాష్ట్రపతి చేతులమీదుగా ఈ అవార్డును అందుకోబోతున్నారు. ఈ క్రమంలోనే బాలయ్యకి పద్మభూషణ్ అవార్డు లభించడంతో ఆయన సోదరి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) రీసెంట్గా గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Nara Chandrababu Naidu) తో పాటు సినీ ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు.
బాలకృష్ణ ఫేవరెట్ హీరోయిన్స్..
ఈ క్రమంలోనే పార్టీలో నారా భువనేశ్వరి తన సోదరుడిని కొన్ని ప్రశ్నలు సరదాగా అడగగా.. అందులో భాగంగానే కెరియర్ లో మీకు ఇష్టమైన ముగ్గురు హీరోయిన్లు ఎవరు? అని ప్రశ్నించింది. దీనికి బాలయ్య సమాధానం చెబుతూ.. ముగ్గురు క్రేజీ హీరోయిన్ల పేర్లు ఆయన చెప్పారు. అయితే వారు ఇప్పటి తరం హీరోయిన్లు కాదు. ఒకప్పుడు తమ నటనతో మెప్పించి లేడీ బాస్ అనిపించుకున్నారు. ఇక ఎవరా ముగ్గురు అంటే విజయశాంతి (Vijayashanti), రమ్యకృష్ణ(Ramyakrishna), సిమ్రాన్ (Simran)అంటే తనకు ఇష్టమని చెప్పుకొచ్చారు. ఇకపోతే వీరి ముగ్గురితో కూడా బాలకృష్ణ సినిమాలు చేసిన విషయం తెలిసిందే.
విజయశాంతి..
ముఖ్యంగా బాలకృష్ణ విజయశాంతితో రౌడీ ఇన్స్పెక్టర్, మువ్వా గోపాలుడు, లారీ డ్రైవర్, ముద్దుల మామయ్య ఇలా దాదాపు 17 సినిమాల వరకు ఆమెతో కలిసి నటించారు.
రమ్యకృష్ణ..
అలాగే రమ్యకృష్ణతో బంగారు బుల్లోడు, దేవుడు, వంశానికి ఒక్కడు అంటే పలు చిత్రాలలో నటించారు
సిమ్రాన్..
బాలకృష్ణ సిమ్రాన్ తో కూడా తన కెరీర్లో బెస్ట్ గా నిలిచిన చిత్రాలలో నటించారు. ముఖ్యంగా ఇందులో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలలో సిమ్రాన్ తో కలిసి బాలయ్య నటించడం జరిగింది. ఇక ఇలా ఈ ముగ్గురు హీరోయిన్లు అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు బాలయ్య.
బాలకృష్ణ సినిమాలు..
బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. అఖండతో మొదలైన ఆయన విజయపరంపర నేటికీ కొనసాగుతోంది. ఇకపోతే డాకు మహారాజ్ సక్సెస్ అయినట్టు చూపిస్తున్నారు. కానీ దాదాపు రూ.18 కోట్ల నష్టాన్ని మిగిల్చింది ఈ చిత్రం. ఇక ప్రస్తుతం బోయపాటి శ్రీను (Botapati sreenu) దర్శకత్వంలో ‘అఖండ’ సీక్వెల్ ‘అఖండ 2’ లో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని (Gopichandh malineni) దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో 2023 సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద వీరసింహారెడ్డి సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు బాలయ్య. అందుకే మళ్ళీ ఆయన దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఇక అలాగే మళ్లీ బాబీ డైరెక్షన్లో సినిమా చేయబోతున్నట్లు సమాచారం.