వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయం వేడుక్కుతోంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే తాడిపత్రికి పెద్దారెడ్డి వస్తే అడ్డుకుంటామని టీడీపీ నేతలు, కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో పోలీసులు తాడిపత్రిలో భారీగా మోహరించారు. పెద్దారెడ్డిని తాడిపత్రి రావద్దని జిల్లా ఎస్పీ జగదీష్ కోరినట్లు సమాచారం. అయితే పెద్దారెడ్డి మాత్రం తాను తాడిపత్రికి వెళ్లి తీరుతానని పట్టుబట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో పెద్దారెడ్డి తాడిపత్రికి బయల్దేరితే తిమ్మంపల్లిలోనే హౌస్ అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధం అయ్యారు. అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.
Also Read: హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ కైవసం, ఛైర్మన్‌గా రమేష్ ఎన్నిక
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని జేసీ అనుచరలు తాడిపత్రికి రానివ్వకుండా అడ్డుపడుతున్నారంటూ.. గత కొన్ని రోజులుగా వాదనలు జరుగుతున్న నేపథ్యంలో.. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఖచ్చితంగా తాడిపత్రి వెళ్లొచ్చు అంటూ హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి అనుచరులతో కలిసి తాడిపత్రి వెళ్లడానికి సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. తాను వెళ్లి తీరాల్సిందే అంటూ వాగ్వాదానికి దిగనట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్ చేసినట్లు సమాచారం. జేసీ అనుచరులు మాత్రం జై జేసి జై జేసి అంటూ నినాదాలు చేశారు. ఖచ్చితంగా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి వెళ్లనివ్వం అని తేల్చి చెబుతున్నారు. గతంలో పెద్దారెడ్డి జేసీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు జేసీ అనుచరులు దాడి చేసిన సంగతి తెలిసిందే.