E-Paper
Advertisement

OTT Releases: ఓటీటీలోకి ‘బిచ్చగాడు 2’.. ఈ వారం అన్నీ మంచి సినిమాలే..

OTT Releases: ఓటీటీలోకి ‘బిచ్చగాడు 2’.. ఈ వారం అన్నీ మంచి సినిమాలే..
Advertisement
Bichagadu 2 OTT

OTT Releases: బిచ్చగాడు సినిమా నిర్మాతలకు శ్రీమంతులను చేసింది. బిచ్చగాడు 2 సైతం కాసుల వర్షం కురిపించింది. మొదటి మూవీలో తల్లి సెంటిమెంట్ స్ట్రాంగ్‌గా వర్కవుట్ అయితే.. ఈసారి సిస్టర్ సెంటిమెంట్‌తో సూపర్ హిట్ సాధించింది. విజయ్ ఆంటోనీ.. బిచ్చగాడి రోల్‌లో రెండుసార్లు పండుగ చేసుకున్నాడు. సమ్మర్‌లో మంచి హిట్ కొట్టిన బిచ్చగాడు 2.. త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. ఎండల్లో ఈ సినిమా చూడలేని వాళ్లు.. ఇక ఓటీటీలో చూసేయొచ్చు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండనుంది.
ఇంతకీ బిచ్చగాడు 2 ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే.. డిస్నీ+హాట్‌స్టార్‌.
ఎప్పటి నుంచి అంటే.. జూన్‌ 18.

ఇక, ఈ వేసవికి చల్లని చిరుగాలి.. అంటూ నందిని రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ‘అన్నీ మంచి శకునములే’ మూవీ సైతం ఓటీటీలోకి వచ్చేస్తోంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది. జూన్ 17 నుంచి స్ట్రీమింగ్.

Advertisement

క్రిస్‌ హేమ్స్‌ వర్త్‌ (Chris Hemsworth) హీరోగా వచ్చిన ఫుల్లీ యాక్షన్ లోడెడ్ మూవీ ‘ఎక్స్‌ట్రాక్షన్‌2’ (Extraction 2) సైతం ఈ వారమే ఓటీటీలో ఎంట్రీ ఇవ్వనుంది. జూన్‌ 16 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

OTTలో ఈ వారం రిలీజెస్:
అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
అన్నీ మంచి శకునములే (తెలుగు) జూన్ 17
టూ సోల్స్‌ (తెలుగు) స్ట్రీమింగ్‌
కాందహార్‌ (ఇంగ్లీష్‌) జూన్‌ 16
హైవే లవ్‌ (హిందీ)
జీ కర్దా (హిందీ) జూన్‌ 15
రావణకొట్టం (తమిళం) జూన్‌ 16
చార్లీస్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (మలయాళం) జూన్‌ 16
తారమ్‌ తీర్థ కూడర్‌ (మలయాళం) జూన్‌ 16

Advertisement

నెట్‌ఫ్లిక్స్‌
ఎక్స్‌ట్రాక్షన్‌2 జూన్ 16
బ్లాక్‌ వకర్‌ (జపనీస్‌) జూన్‌ 16
ది విలేజ్‌ (జపనీస్‌) జూన్‌ 16

డిస్నీ+హాట్‌స్టార్‌
బిచ్చగాడు2 జూన్ 18
షెవలియర్‌ (హాలీవుడ్‌) జూన్‌ 16

జీ5
తమిళరసన్‌ (తమిళ్‌) జూన్‌ 16
సియా (హిందీ) జూన్‌ 16

సోనీలివ్‌
ఫర్హానా (తమిళ చిత్రం) జూన్‌ 16

లయన్స్‌ గేట్‌ప్లే
డెస్పరేట్‌ రైడర్స్‌ (హాలీవుడ్) జూన్‌ 16

జియో సినిమా
రఫూచక్కర్‌ (హిందీ సిరీస్‌) జూన్‌ 15
ఐ లవ్‌ యూ (హిందీ చిత్రం)జూన్‌ 16

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×