E-Paper
Advertisement

OTT: ఓటీటీలో మీటర్, మ్యాచ్ ఫిక్సింగ్.. మురుగదాస్ మూవీ కూడా.. ఈ వారం 16 రిలీజెస్..

OTT: ఓటీటీలో మీటర్, మ్యాచ్ ఫిక్సింగ్.. మురుగదాస్ మూవీ కూడా.. ఈ వారం 16 రిలీజెస్..
Advertisement

OTT: థియేటర్లలో కొత్త సినిమాల కంటే ఓటీటీలో రిలీజెస్ మీదనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు వ్యూయర్స్. సినిమా టాక్ ఏమాత్రం బాగా లేకున్నా.. థియేటర్స్‌కి వెళ్లడం లేదు. ఓటీటీలో వచ్చినప్పుడు ఫ్రీగా చూద్దాంలే అనుకుంటున్నారు. అందుకే, థియేటర్లో మిస్ చేసిన మూవీస్ ఎప్పుడెప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతాయా? అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రతీ శుక్రవారం సినిమాలు, వెబ్ సిరీస్‌ల విడుదలతో పండుగ చేసుకుంటున్నారు. మరి, ఈ వారం ఏమి రానున్నాయంటే…

Advertisement

మీటర్‌:- కిరణ్‌ అబ్బవరం హీరోగా వచ్చిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మీటర్‌’. అతుల్య హీరోయిన్. ఈ మధ్యే థియేటర్లకు వచ్చింది. మే 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఫ్రీనే కదా.. చూసేస్తే పోలా.

నాగశౌర్య, మాళవిక నాయర్‌ కలిసి నటించిన యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. టైటిల్ వెరైటీగా ఉందికదా. డైరెక్టర్ శ్రీనివాస్‌ అవసరాల మరి. ఆయన సినిమాలన్నీ ఓ తరహాలో ఉంటాయి. థియేటర్లలో ఓకే టాక్ తెచ్చుకుంది. సన్‌నెక్ట్స్‌ లో సందడి చేసేందుకు వచ్చేస్తున్నారు ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’.

Advertisement

‘మ్యాచ్ ఫిక్సింగ్’. కామెడీతో కూడిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌. సీనియర్‌ దర్శకుడు ఇ.సత్తిబాబు డైరెక్షన్. విశ్వంత్‌, వసంతి కృష్ణన్‌, ప్రగ్యా నయన్‌, అభిజీత్‌ తదితరులు నటించారు. ‘ఈ టీవీ విన్’ మే 5వ నుంచి స్ట్రీమింగ్‌.

గౌతమ్‌ కార్తీక్‌ హీరోగా డైరెక్టర్ ఏఆర్‌ మురుగదాస్‌ సమర్పణలో వచ్చిన చిత్రం ‘ఆగస్టు 16.. 1947’. ఏప్రిల్‌ 14న తెలుగులో డబ్బింగ్ మూవీగా రిలీజ్ అయింది. థియేటర్లలో తేలిపోయింది. ఇప్పుడు టెంట్‌కొట్ట ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ కాబోతోంది. మురుగదాస్ ఫ్యాన్స్ ఈ మూవీపై ఓ లుక్కేయొచ్చు.

ఇక అన్నిటికంటే హైలైట్ సినిమా ఏంటంటే.. పవన్ కల్యాణ్ మూవీ ‘తమ్ముడు’, ప్రభాస్ ‘యోగి’ సైతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుండటం. ఇంకేం ఫ్యాన్స్ గెట్ రెడీ…

ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో:
తమ్ముడు (తెలుగు)
యోగి (తెలుగు)
3 (తెలుగు)
రౌడీ ఫెలో (తెలుగు)
అమృతం చందమామలో (తెలుగు)
శాంక్చురీ (మూవీ)
ది లార్వా ఫ్యామిలీ(యామినేషన్‌)
తూ ఝూటీ మై మక్కార్‌ (హిందీ)

ఈవారం డిస్నీ+హాట్‌స్టార్‌లో:
కరోనా పేపర్స్‌ (మలయాళ చిత్రం )
సాస్‌ బహూ ఔర్‌ ఫ్లమింగో (హిందీ)

ఈవారం జీ 5లో:
ఫైర్‌ ఫ్లైస్‌ (హిందీ సిరీస్‌)
షెభాష్‌ ఫెలూద (బెంగాలీ)

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×