BigTV English

Layoffs: ఐటీ జాబ్స్ ఊస్టింగ్.. కాగ్నిజెంట్‌లో 3,500 మంది ఫసక్!

Layoffs: ఐటీ జాబ్స్ ఊస్టింగ్.. కాగ్నిజెంట్‌లో 3,500 మంది ఫసక్!


Layoffs: మొన్నటి వరకూ ఐటీ జాబ్స్‌కు ఫుల్ డిమాండ్ ఉండే. కరోనా టైమ్‌లో ఎవరిని పడితే వారిని జాబుల్లోకి తీసుకున్నారు. పెద్ద పెద్ద జీతాలు ఇచ్చారు. ఎంచక్కా ఇంట్లోనే కూర్చోబెట్టి పని చేయించుకున్నారు. ఇప్పుడా ఎంజాయ్‌మెంట్ లేదు. ఆఫీసుకు తప్పకుండా రావాల్సిందేనని స్ట్రిక్ట్‌గా చెబుతున్నారు. అప్పట్లో తీసుకున్న ఎంప్లాయిస్‌ను ఇప్పుడు తీసుకుంటున్నారు. అంతర్జాతీయంగా రెసిషన్ అని, బ్యాంకులు దివాళా తీస్తుండటంతో బిజినెస్ తగ్గిందని.. ఏవేవో సాకులు చెబుతూ పని తక్కువ చేసే ఉద్యోగులకు పింక్ స్లిప్స్ ఇస్తున్నాయి ఐటీ కంపెనీస్. లేటెస్ట్‌గా భారీ లేఆఫ్స్ ప్రకటించబోతోంది కాగ్నిజెంట్‌.

ఒకరు ఇద్దరు కాదు.. ఏకంగా 3,500 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించేందుకు సిద్ధమైంది కాగ్నిజెంట్. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా త్వరలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు పింక్‌ స్లిప్స్‌ ఇవ్వనున్నట్టు చెబుతోంది. కొన్ని కార్యాలయాలను మూసివేయనుంది. 11 మిలియన్‌ స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్‌ను వదులుకోనుంది.


అమెరికాకు చెందిన కాగ్నిజెంట్‌ కంపెనీ.. ఇండియాలోనే ఎక్కువగా కార్యక్రమాలు కొనసాగిస్తోంది. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. కాగ్నిజెంట్‌లో 3,51,500 మంది ఉద్యోగులు ఉండగా.. అందులో 2 లక్షల వరకు భారత్‌లోనే జాబ్ చేస్తున్నారు.

ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కాగ్నిజెంట్‌ నికర లాభంలో 3 శాతం వృద్ధిని నమోదు చేసింది. 14.6 శాతం మార్జిన్ నమోదు చేసింది. మిగతా ఐటీ కంపెనీల రాబడితో పోలిస్తే ఇది చాలా తక్కువ. ముందుముందు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా. అందుకే, ఖర్చు తగ్గించుకోవడంపై ఫోకస్ పెట్టిన కాగ్నిజెంట్.. 3,500 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఇందులో భారత్‌ నుంచి ఎంతమంది ఉంటారోనని టెన్షన్‌ పడుతున్నారు మనోళ్లు. కొన్ని ఆఫీసులు సైతం మూసేయనుండటంతో.. చాలామంది జాబులే ఊడుతాయని అంటున్నారు.

Related News

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే జాబ్ నీదే బ్రో..

NIACL: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. స్టార్టింగ్ వేతనమే రూ.50,000.. డోంట్ మిస్

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Big Stories

×