Big Stories

Viveka Murder Case: ఆ రోజు రాత్రి.. అవినాష్‌రెడ్డి 7 సార్లు ఫోన్.. కాల్స్‌ లిస్ట్ బయటపెట్టిన సీబీఐ..

Viveka Murder Case: కష్టమైన, క్లిష్టమైన కేసులనే సీబీఐకి అప్పగిస్తారు. ఎందుకంటే ఆ దర్యాప్తు సంస్థ విచారణ అంత పక్కాగా ఉంటుంది మరి. సీబీఐ కేసు టేకప్ చేసిందంటే.. ప్రతీ చిన్న విషయాన్ని ప్రొఫెషనల్‌గా డీల్ చేస్తుంది. పైనుంచి ఎలాంటి ప్రెజర్ లేకపోతే.. దర్యాప్తు మామూలుగా ఉండదు మరి. వివేకా హత్య కేసు విషయంలోనూ అలానే జరుగుతోంది. పక్కాగా సాక్షాలు, ఆధారాలు సేకరిస్తోంది. వివేకాతో సంబంధం ఉన్న ప్రతీఒక్కరినీ ప్రశ్నిస్తోంది. ఆ రోజు రాత్రి అసలేం జరిగిందనే దానిపై పకడ్బందీగా విచారిస్తోంది.

- Advertisement -

హత్య కేసు అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిల చుట్టూనే తిరుగుతోంది. చంపింది వారు కాకపోయినా.. హత్యకు కుట్ర, సాక్షాధారాల ధ్వంసం వారి కనుసన్నల్లోనే జరిగిందని భావిస్తోంది. అందుకు బలమైన ఆధారాలు సేకరించింది. అప్రూవర్‌గా మారిన దస్తగిరి వాంగ్మూలం, గూగుల్ టేక్ అవుట్, ఫోన్ కాల్స్ లిస్ట్.. ఇలా టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసింది. ఎంపీ అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌లో సీబీఐ దాఖలు చేసిన కౌంటరులో పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది.

- Advertisement -

నిందితుల మధ్య 2019 మార్చి 14 సాయంత్రం 6 గంటల నుంచి.. మార్చి 15 ఉదయం 8 గంటల మధ్య సాగిన ఫోన్‌ కాల్‌ వివరాలను ప్రస్తావించింది. ఓ చాట్ రూపంలో ఆ వివరాలు కోర్టు ముందు ఉంచింది. ఆ సమయంలో ఎవరెవురు ఎవరికి ఫోన్ చేశారు? ఎంత సేపు మాట్లాడారు? ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్స్.. ఇలా కాల్ లిస్ట్ కంప్లీట్ జాబితా కోర్టుకు సడ్మిట్ చేసింది సీబీఐ. ఆ ఫోన్ కాల్స్ చైన్ సైతం.. అవినాష్ బేస్డ్ గానే నడిచినట్టు తేలింది. సీబీఐ పొందుపరిచిన కాల్స్ లిస్ట్ ఇదే…

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News