E-Paper
Advertisement

Thug Life Trailer: కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ మూవీ ట్రైలర్ రిలీజ్.. ఫుల్ మీల్స్ అంటున్న ఫ్యాన్స్..!

Thug Life Trailer: కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ మూవీ ట్రైలర్ రిలీజ్.. ఫుల్ మీల్స్ అంటున్న ఫ్యాన్స్..!
Advertisement

Thug Life Trailer..కమలహాసన్ (Kamal Haasan), మణిరత్నం (Maniratnam ) కాంబినేషన్లో 1987లో ‘నాయకన్’ అనే సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావాల్సి ఉన్నా.. పలు కారణాలవల్ల ఆగిపోతూ వచ్చింది. అలా ఇప్పుడు 38 ఏళ్ల తర్వాత మళ్లీ వీళ్ళ కాంబో ప్రాణం పోసుకుంది అని చెప్పవచ్చు. కమలహాసన్ రాసుకున్న కథకు మణిరత్నం లైఫ్ ఇచ్చారు. అలా ‘థగ్ లైఫ్'(Thuglife) అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా. కమల్ హాసన్ హీరోగా త్రిష కృష్ణన్ (Trisha Krishnan), సిలంబరసన్ (Silambarasan) , అశోక్ సెల్వన్ (Ashok Selvan) , జోజు జార్జ్ (Joju jarge) , అభిరామి (Abhirami) , సన్యా మల్హోత్ర (Sanya Malhotra), ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi), వైయాపురి, నాజర్, పంకజ్ త్రిపాఠి తదితరులు నటిస్తున్న ఈ చిత్రం జూన్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జాయింట్ సినిమా బ్యానర్లపై కమలహాసన్, ఆర్. మహేంద్ర, మణిరత్నం, శివ అనంత్, ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ (AR Rahman) సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు చిత్ర బృందం. అందులో భాగంగానే ఈరోజు తమిళ్ నుండి ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. మరి ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచిందా? ఇందులో కమల్ హాసన్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారా? అసలు ట్రైలర్లో ఏముంది అనే విషయం ఇప్పుడు చూద్దాం.

థగ్ లైఫ్ మూవీ ట్రైలర్.. ఎలా వుందంటే.?

Advertisement

థగ్ లైఫ్ మూవీ నుండి తాజాగా తమిళ్ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. సస్పెన్స్ క్రియేట్ చేస్తూ.. ముఖం నిండా గాయాలతో నీళ్లలో మునిగిన కమలహాసన్ ను చూపించారు. ఇక తర్వాత మంచు కొండల్లో కమలహాసన్ తీక్షనంగా చూస్తున్నట్టు ట్రైలర్ ప్రారంభం అవుతుంది. “ఇకపై నువ్వు నేను ఒకటే.. చివరి వరకూ” అంటూ ఒక చిన్న పిల్లాడితో కమలహాసన్ చెప్పే డైలాగ్ కాస్త మనసును హత్తుకుంది అని చెప్పవచ్చు. అటు సిలంబరసన్ కూడా యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేశారు. ముఖ్యంగా కమలహాసన్, సిలంబరసన్ కలసి ఒక పెళ్లి వేడుకలో డాన్స్ చేస్తున్న సన్నివేశాలు కూడా చాలా ఆహ్లాదకరంగా అనిపించాయి. అంతేకాదు కమలహాసన్, త్రిష మధ్య రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉండనున్నట్లు ట్రైలర్లో చూపించారు. మొత్తానికి అయితే అటు మాస్, ఇటు ఫ్యామిలీ, యాక్షన్ , రొమాంటిక్ ఇష్టపడే వారికి ఈ సినిమా ఫుల్ మీల్స్ అని చెప్పడంలో సందేహం లేదు. మొత్తానికి అయితే మళ్లీ మణిరత్నం – కమలహాసన్ కాంబో గట్టి కం బ్యాక్ ఇవ్వడం గ్యారంటీ అని ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

విడుదలకు ముందే లాభాల బాట పట్టిన థగ్ లైఫ్..

Advertisement

ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందే లాభాల బాట పట్టిన విషయం తెలిసిందే. అటు ఓటీటీ కోసం నెట్ఫ్లిక్స్ రూ.150 కోట్లను అందించగా.. ఇటు నాన్ థియేట్రికల్ రూ.210 కోట్లు, డిజిటల్ టీవీ హక్కులు రూ.60 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇక జూన్ 5వ తేదీన రాబోతున్న ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమని చెప్పవచ్చు..

ALSO READ: Pawan Kalyan: పవన్ చేతిపై టాటూ.. అర్థం ఏంటో తెలుసా..?

 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×