Pawan Kalyan:మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈయన.. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో వచ్చిన ‘బద్రి’ సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకున్నారు. ఈ సినిమాతో ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత పలు చిత్రాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఒకవైపు సినిమాలలో చేస్తూనే.. మరొకవైపు రాజకీయాలలోకి కూడా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. దాదాపు పది సంవత్సరాలుగా నిర్విరామ కష్టం తర్వాత గత ఏడాది ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టి, తన కలను నెరవేర్చుకున్నారు పవన్ కళ్యాణ్.
అందరి దృష్టిని ఆకర్షించిన పవన్ కళ్యాణ్..
ఇకపోతే పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఉన్నప్పటికీ.. ఆయన సినిమా రిలీజ్ కోసం ఎంతోమంది అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆయన సినిమా రిలీజ్ అయింది అంటే చాలు.. ప్రేక్షకులకు అసలైన పండుగని చెప్పవచ్చు. మరి ఆయనకున్న క్రేజ్ అలాంటిది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో మరింత బిజీగా మారిపోయారు. అయితే ఇలాంటి సమయంలో తాజాగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది . అదేంటంటే పవన్ కళ్యాణ్ ఇటీవల ఒక మీటింగ్ కి హాజరవగా.. ఆ మీటింగ్ లో ఆయన చేతి పై పచ్చబొట్టు స్పష్టంగా కనిపించింది. పవన్ కళ్యాణ్ అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలో ఆ పచ్చబొట్టు కాస్త కెమెరా కంట పడింది. దీంతో ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ పచ్చబొట్టు వెనుక ఉన్న రహస్యం ఏంటని? దాని అర్థం ఏంటని? నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
పచ్చబొట్టు అర్థం ఏంటో..?
అసలు విషయంలోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసమే ఆ పచ్చబొట్టు వేయించుకున్నారని, అటు మీనింగ్ కూడా అదే అని తెలుస్తోంది. మరి ఈ పచ్చబొట్టు దీని కోసమే వేసుకున్నారా? లేక ఇంకేదైనా కారణం ఉందా? అన్నది తెలియాల్సి ఉంది. ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాలలో ‘OG’ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాని యంగ్ డైరెక్టర్ సుజిత్ (Sujeetha) తెరకెక్కిస్తున్నారు. మాఫియా బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్లో నిర్మిస్తూ ఉండగా.. ఎస్.థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కి జోడిగా ప్రియాంక మోహన్ (Priyanka Mohan), అర్జున్ దా(Arjun Das), ప్రకాష్ రాజ్ (Prakash Raj), శ్రీయా రెడ్డి (Shriya Reddy) తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ALSO READ:Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థి కిడ్నాప్.. అసలేం జరుగుతోంది.!