Beetroot For Skin: బీట్ రూట్‌లో పోషకాల సమృద్ధిగా ఉంటాయి. ఇది చర్మ సంరక్షణలో కూడా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫోలేట్, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా బీట్ రూట్‌ను ఫేస్ ప్యాక్‌ల రూపంలో ఉపయోగించడం ద్వారా చర్మం మృదువుగా, కాంతివంతంగా , ఆరోగ్యవంతంగా కనిపిస్తుంది. బీట్ రూట్‌తో చర్మానికి కలిగే ప్రయోజనాలు, ఫేస్ ప్యాక్ ల తయారీ వాడే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బీట్ రూట్‌తో చర్మానికి కలిగే ప్రయోజనాలు:
1. యాంటీఆక్సిడెంట్ గుణాలు: బీట్ రూట్‌లోని బీటలైన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి.. చర్మంలో వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి. ఇవి ముడతలను నివారిస్తాయి.
2. చర్మ కాంతి: బీట్ రూట్‌లోని విటమిన్ సి చర్మంలోని మొటిమలు, నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్‌ను తగ్గించి, చర్మానికి సహజమైన కాంతిని అందిస్తుంది.
3. హైడ్రేషన్: బీట్ రూట్‌లోని నీటి శాతం చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఇది పొడి చర్మ సమస్యలను నివారిస్తుంది.
4. మొటిమల నివారణ: బీట్ రూట్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మొటిమలు, చర్మ ఎరుపును తగ్గిస్తాయి.
5. డిటాక్సిఫికేషన్: బీట్ రూట్ చర్మంలోని విష పదార్థాలను తొలగించి.. స్పష్టమైన, ఆరోగ్యవంతమైన చర్మాన్ని అందిస్తుంది.
బీట్ రూట్‌తో ఫేస్ ప్యాక్‌లు:
1. బీట్ రూట్, తేనె ఫేస్ ప్యాక్
కావాల్సిన పదార్థాలు:
బీట్ రూట్ రసం – 2 టేబుల్ స్పూన్లు
తేనె – 1 టీస్పూన్
రోజ్ వాటర్ – 1 టీస్పూన్
తయారీ విధానం:
1. ఒక బీట్ రూట్‌ను తురిమి, దాని నుండి జ్యూస్ తీయండి.
2. ఒక గిన్నెలో బీట్ రూట్ రసం, తేనె, రోజ్ వాటర్ తీసుకుని మిక్స్ చేయండి.
3. ఈ మిశ్రమాన్ని ముఖంపై సమానంగా అప్లై చేయండి.
4. తర్వాత 15 నిమిషాల పాటు ఆరనివ్వండి. అనంతరం చల్లని నీటితో కడగండి.
ప్రయోజనాలు: ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అంతే కాకుండా సహజ కాంతిని అందిస్తుంది. తేనెలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు మొటిమలను నివారిస్తాయి.
2. బీట్ రూట్, పెరుగు ఫేస్ ప్యాక్
కావాల్సిన పదార్థాలు:
బీట్ రూట్ పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
పెరుగు – 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం – 1 టీస్పూన్
తయారీ విధానం:
1. బీట్ రూట్‌ను ఉడికించి, మెత్తగా చేయండి.
2. ఒక గిన్నెలో బీట్ రూట్ పేస్ట్, పెరుగు, నిమ్మరసాన్ని వేసి బాగా కలపండి.
3. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై అప్లై చేయండి.
4. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగండి.
ప్రయోజనాలు: ఈ ఫేస్ ప్యాక్ చర్మంలోని నల్ల మచ్చలను తగ్గిస్తుంది. అంతే కాకుండా పెరుగు చర్మాన్ని స్మూత్‌గా మారుస్తుంది.
3. బీట్ రూట్ , ఓట్స్‌తో ఫేస్ ప్యాక్:
కావాల్సిన పదార్థాలు:
బీట్ రూట్ రసం – 2 టేబుల్ స్పూన్లు
ఓట్స్ పొడి – 1 టేబుల్ స్పూన్
పాలు – 1 టేబుల్ స్పూన్
Also Read: చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారా? ఈ 5 హోం రెమెడీస్‌తో ప్రాబ్లమ్ సాల్వ్
తయారీ విధానం:
1. ఓట్స్‌ను పొడి చేసి, ఒక గిన్నెలో వేయండి.
2. బీట్ రూట్ రసం, పాలను గిన్నెలో వేసి కలపండి.
3. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి, సున్నితంగా మసాజ్ చేయండి.
4. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగండి.
ప్రయోజనాలు: ఈ ఫేస్ ప్యాక్ చర్మంపై మృత కణాలను తొలగిస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని శుభ్రపరుస్తుంది.