BigTV English
Advertisement

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

ANR Award.. ప్రముఖ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కి తాజాగా అరుదైన గౌరవం దక్కబోతోంది. మెగాస్టార్ చిరంజీవి తాజాగా అక్కినేని జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. అక్టోబర్ 28వ తేదీన అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆయన చేతులు మీదుగా చిరంజీవికి అక్కినేని జాతీయ అవార్డును బహుకరించనున్నారు. ఈరోజు అక్కినేని శత జయంతి వేడుకలు హైదరాబాదులో నిర్వహించారు.


చిరంజీవికి అక్కినేని జాతీయ అవార్డు..

అసలు విషయంలోకి వెళితే, స్వర్గీయ నటులు అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswar Rao) శత జయంతి నేడు. ఈ సందర్భంగా హైదరాబాదులో అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు నిర్వహించగా.. ఆర్కే సినీ ప్లెక్స్ లో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి నాగార్జున (Nagarjuna) తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు (Raghavendrarao) కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. నా తండ్రి నవ్వుతూ జీవించాలని మాకు నేర్పించారు. ఈ వారాంతంలో ఫిలిం ఫెస్టివల్ జరగబోతోంది కాబట్టి అన్నపూర్ణ స్టూడియోలో మా అభిమానులు రక్తదానం చేస్తున్నారు. అభిమానుల ఆదరణ మా కుటుంబం పై ఎప్పుడు ఉంటుందని, వారు మమ్మల్ని ఎప్పుడూ మరిచిపోరని, మేము ఆకాంక్షిస్తున్నాము. కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారి ఏఎన్నార్ అవార్డులు ఇస్తున్నాము. ఈసారి చిరంజీవికి ఆ అవార్డు ఇవ్వాలని నిర్ణయించుకున్నాము అంటూ నాగార్జున తెలిపారు.


అక్టోబర్ 28న అక్కినేని జాతీయ అవార్డు ప్రధానోత్సవం..

ANR Award: Award to Megastar..Nag who announced that today is Pradnotsavam..!
ANR Award: Award to Megastar..Nag who announced that today is Pradnotsavam..!

అంతేకాదు ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం అక్టోబర్ 28వ తేదీన జరుగుతుందని, ఇప్పటికే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ని కలవగా ఆయన కూడా ఈ వేడుకకు రావడానికి ఆసక్తి చూపించాలని, ఆయన చేతుల మీదుగానే చిరంజీవికి ఈ అవార్డు ప్రధానోత్సవం జరుగుతుంది అంటూ నాగార్జున వెల్లడించారు.
ఇక ప్రస్తుతం నాగార్జున చేసిన కామెంట్లకి మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు మెగా అభిమానులు మెగా కుటుంబ సభ్యులు అక్కినేని కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

క్యాన్సర్ తో పోరాడి స్వర్గస్తులైన అక్కినేని నాగేశ్వరరావు..

అక్కినేని నాగేశ్వరరావు విషయానికి వస్తే , సినీ ఇండస్ట్రీకి మూల స్తంభంగా నిలిచిన వ్యక్తి. ఎన్నో జానపద, సాంఘిక , చారిత్రక చిత్రాలలో నటించి తన అద్భుతమైన నటనతో ఎంతోమంది ఆడియన్స్ ను సొంతం చేసుకున్నారు. చిట్ట చివరిగా మనం సినిమాలో నటించిన అక్కినేని నాగేశ్వరరావు ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడి స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఇక ఈయన మరణాంతరం ఈయన జ్ఞాపకార్థంగా అక్కినేని జాతీయ అవార్డులను వారి కుటుంబ సభ్యులు బహకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి శత జయంతి దినోత్సవ వేడుకలు జరుగుతుండగా.. ఈ వేడుకల్లో భాగంగా ఈసారి చిరంజీవికి అవార్డు దక్కనుంది అని సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×