Inaya Sultana : బిగ్ బాస్ బ్యూటి ఇనయ సుల్తానా గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఒకప్పుడు సినిమాల్లో చిన్న క్యారక్టర్ లో కనిపిస్తూ తన నటనతో ప్రేక్షకుల మనసులో గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆరో సీజన్‌లో ఆమె చేసిన రచ్చ వేరే లెవల్. ప్రారంభంలో డల్‌గా ఉన్నా, అనంతరం రెచ్చిపోయి టైటిల్ రేసులోకి వచ్చింది. కానీ సడెన్‌గా ఎలిమినేట్ అయి షాకిచ్చింది. అయితే బిగ్ బాస్ షో మాత్రం ఇనయ సుల్తానాకి మంచి క్రేజ్‌ని తీసుకొచ్చింది.. హౌస్ నుంచి బయటకు వచ్చాక కొన్ని సినిమా అవకాశాలు పలకరించాయి.. ఈ మధ్య వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఇనయ ఇప్పుడు ఏకంగా ప్రధాన పాత్రలో నటించే అవకాశాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈమె “మదం ” అనే సినిమాలో నటిస్తుంది. ఆ మూవీ టైటిల్ కు తగ్గట్లే కాస్త బోల్డ్ గా ఉంటుందని తెలుస్తుంది. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవ్వడంతో ఇనయ పై సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇనయ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక సోషల్ మీడియాలో హాట్ లుక్ లో కనిపిస్తూ యువతకు నిద్ర లేకుండా చేసింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల వరుసగా ఆమె సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. ఇటీవల `బచ్చలమల్లి` చిత్రంలోనూ వేశ్య పాత్రలో కనిపించి ఆశ్చర్యపరిచింది ఇనయ. ఇక తాజాగా మదం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కథ, కథనాలు, విభిన్నమైన కాన్సెప్ట్‌తో సినిమాలు తీస్తే ప్రేక్షకులు భారీ విజయాలు అందించిన చరిత్ర టాలీవుడ్‌కు ఉంది. అలాంటి కోవలో వస్తున్న సినిమా ఇది..
ఈ మూవీని మార్చి 14 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దాంతో ఈ మూవీ ప్రమోషన్స్ ను మొదలు పెట్టారు టీమ్.. చూడాలంటే ఓ ధైర్యం ఉండాలంటూ చిత్ర యూనిట్ సవాల్ విసిరింది. ఆ సినిమాలో కంటెంట్ ఏమిటి? కాన్సెప్ట్ ఏమిటనే విషయానికొస్తే.. ఏకైవ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సూర్యదేవర రవీంద్రనాథ్, రమేష్ బాబు కోయ నిర్మించిన సినిమా ఈ మదం. హర్ష గంగవరపు, లతా విశ్వనాథ్, ఇనయ సుల్తాన కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మార్చి 14న రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో మూవీకి సంబంధించిన టీజర్‌ను తండేల్ సినిమాతో పాటుగా రిలీజ్ చేశారు. ఆ మూవీ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందని చిత్రయూనిట్ అంటున్నారు. గతంలో ఇలాంటి సినిమాలు ఎప్పుడు రాలేదని.. తమిళం, మలయాళం భాషల్లో ఇలాంటి కంటెంట్ వస్తుంటుంది. మదం కథ నాకు చాలా నచ్చింది. ఇలాంటి క్లైమాక్స్ ఇప్పటి వరకు భారతీయ సినిమా చరిత్రలో రాలేదు. ఈ మూవీని చూడాలంటే చాలా గుండె ధైర్యం కావాలి అని డైరెక్టర్ వంశీకృష్ణ మల్లా అన్నారు.. మొత్తానికి ఈ టీజర్ తో సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తుంది. ఇక మూవీ ఎలా ఉంటుందో చూడాలి..