BigTV English

Vastu Tips: వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారా? కంప్యూటర్‌ను ఈ దిశలో పెట్టి వర్క్ చేస్తే ఏమవుతుందో తెలుసా?

Vastu Tips: వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారా? కంప్యూటర్‌ను ఈ దిశలో పెట్టి వర్క్ చేస్తే ఏమవుతుందో తెలుసా?

Vastu tips: వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది. అప్పుడప్పుడు ఆఫీసులకు సెలవు పెట్టి కూడా ఇంటి నుంచే పని చేస్తూ ఉంటారు. అలాంటివారు వాస్తు ప్రకారం ఎక్కడ కంప్యూటర్ ను పెట్టాలో తెలుసుకోవాలి.


కరోనా దెబ్బకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఒక్కసారిగా పుట్టుకొచ్చాయి. ఇప్పటికి కూడా చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం ఎంపికను ఇస్తున్నాయి. కొన్నిసార్లు ఆఫీసు నుంచి కొన్నిసార్లు ఇంటి నుంచి పనిచేసే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఇలా వర్క్ ఫ్రమ్ హోం పనిచేస్తున్నప్పుడు మీ కంప్యూటర్‌ను లేదా లాప్‌టాప్ ను ఇంట్లో ఏ దిశలో ఉంచి పనిచేయాలో తెలుసుకోండి. వాస్తు ప్రకారం కంప్యూటర్‌ను అన్ని దిశల్లో ఉంచి పనిచేయడం మంచి పద్ధతి కాదు. ఇది ఉద్యోగ సమస్యలను ఇంట్లో ఆర్థిక సమస్యలను కలిగించవచ్చు. కాబట్టి ఇంట్లో కంప్యూటర్ ఏ దిశలో ఉంచుకుంటే ఉత్తమ ఫలితాలు వస్తాయో తెలుసుకోవాలి .

నేటి కాలంలో లాప్‌టాప్ లేదా కంప్యూటర్ ప్రతి ఒక్కరికి అవసరంగా మారిపోయింది. దీన్ని ఇంట్లోనే ఉంచుకునే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఆఫీసులో ఒకటి, ఇంట్లో ఒకటి పెట్టుకునే వారు కూడా అధికంగానే ఉన్నారు. కాబట్టి ఇంట్లో ఏ దిశలో కంప్యూటర్ ఉంచుకుంటే ఉత్తమ ఫలితాలు దక్కుతాయో తెలుసుకోండి. కొన్నిసార్లు తప్పుడు ప్రదేశాలలో కంప్యూటర్‌ను ఉంచడం వల్ల ఇంటి వాస్తు ప్రభావితం అవడం ప్రారంభం అవుతుంది. దీనివల్ల ఫలితాలు నెగిటివ్ గా వస్తాయి.


కంప్యూటర్ ఎక్కడ పెట్టాలి?
వాస్తు ప్రకారం ఇంట్లో కంప్యూటర్‌ను సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం. ఇది ఇంట్లోని ప్రతికూలతను తొలగిస్తుంది. సానుకూల శక్తిని పెంచుతుంది. కంప్యూటర్ ను దక్షిణం లేదా పడమర దశలో ఉంచడం మంచిది. దక్షిణం, పడమర దిశల్లో కంప్యూటర్ ను పెట్టి పని చేస్తే అది ఉత్తమమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఒక వ్యక్తి కంప్యూటర్ మీద పనిచేస్తున్నప్పుడు అతని ముఖం కొద్దిగా కుడివైపుకు తిరిగి ఉండేలా చూసుకోవాలి. అలాగే కంప్యూటర్ పెట్టిన స్థానంలో పువ్వులు, షో పీసులు వంటివి పెట్టి అందంగా ఉండేలా చూసుకోవాలి. పొరపాటున కూడా కంప్యూటర్ ను తూర్పు వైపు పెట్టవద్దు.

యంత్రాలతో..

వాస్తు శాస్త్రంలో ప్రతి వస్తువుకు ఒక స్థానం ఉంటుంది. ఆ విషయాల్లో సరైన అవగాహన అవసరం. అప్పుడే ఇంటిలో సానుకూల శక్తి పెరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందో కుటుంబ సభ్యులపై కూడా ఆ ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి వాస్తు నియమాలను తెలుసుకోవలసిన అవసరం ఉంది. అలాగే ఇంట్లో వాస్తు శాస్త్రం సూచించిన దిశలో యంత్రాలను కూడా అమర్చడం వల్ల నెగిటివ్ ఎనర్జీని తగ్గించుకోవచ్చు.

ఈ దిక్కులే బెస్ట్

ఇప్పుడు లాప్ టాప్‌లో వాడుతున్న వారి సంఖ్య కూడా అధికంగా ఉంది. లాప్‌టాప్ కూడా దక్షిణం లేదా పడమర దిశలో ఉంచి పనిచేసుకోవాలి. మీరు పడమర దిశలో లాప్ టాప్ ను పెట్టడం వల్ల మీ ముఖం తూర్పు వైపుకు తిరిగినట్టు ఉంటుంది. అలాగే దక్షిణం వైపు కంప్యూటర్‌ను పెడితే మీరు ఉత్తరం వైపుకు తిరిగి పనిచేస్తున్నట్టుగా వస్తుంది. కాబట్టి ఇదే అన్ని విధాలా ఉత్తమ పద్ధతి.

ఇవన్నీ పాటిస్తే.. శుభం

వాస్తు చక్కగా ఉన్న ఇంట్లో అన్నీ శుభాలే కలుగుతాయి. పాజిటివ్ ఎనర్జీ కూడా అధికంగా ఉంటుంది. దీని వల్ల ఆ ఇంటి సభ్యులంతా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి వాస్తు నిపుణుల చిట్కాలు, సలహాలు అప్పుడప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంట్లో టీవీ పెట్టేందుకు, ఫ్రిజ్ పెట్టేందుకు, లాప్ టాప్ పెట్టేందుకు, మంచం పెట్టేందుకు ఇలా అన్ని వస్తువులు పెట్టేందుకు సరైన దిశలో ఉంటాయి వాస్తు నిపుణులు ఆ విషయాలను చక్కగా వివరిస్తారు. వాస్తుని నమ్మేవారు ఆ వాస్తు ప్రకారం పనులు చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు.

Also Read: చిల్కూరు బాలాజీ టెంపుల్ గురించి మీకు తెలియని విశేషాలు.. ఆ ప్రదక్షిణల వెనుక అంత కథ ఉందా?

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×