BigTV English

Suhas: ‘ఓ భామ అయ్యో రామ’ అంటున్న సుహాస్.. కొత్త సినిమా పోస్టర్ అదిరిపోయిందిగా

Suhas: ‘ఓ భామ అయ్యో రామ’ అంటున్న సుహాస్.. కొత్త సినిమా పోస్టర్ అదిరిపోయిందిగా
OhBhamaAyyoRama
OhBhamaAyyoRama

Suhas – Oh Bhama Ayyo Rama(Telugu cinema news): ఎన్నో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు టాలెంటెడ్ నటుడు సుహాస్. సినీ పరిశ్రమకి వచ్చిన కొత్తలో సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎక్కువగా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లు చేసి తన యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు.


ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే జీవించేస్తాడు. అయితే సైడ్ క్యారెక్టర్ల నుంచి ఒక్క సారిగా అతడు హీరోగా పరిచయమయ్యాడు. ‘కలర్ ఫొటో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ చిత్రం కలెక్షన్లలో దుమ్ము దులిపేసింది.

దీని తర్వాత పలు సినిమాలలో నెగెటివ్ రోల్స్ చేసి మెప్పించాడు. ఆపై రైటర్ పద్మభూషణ్ సినిమా చేసి మరొక సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో పాపులర్ మిడిల్ రేంజ్ హీరోగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత రీసెంట్‌గా అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు సినిమా చేశాడు.


Also Read: వంద కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఓటీటీ వాయిదా.. రాజమౌళి కారణమా?

ఈ మూవీ కూడా అందరినీ విపరీతంగా అలరించింది. ఈ సినిమాతో వరుస హిట్లను సుహాస్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఇదే జోష్‌లో మరికొన్ని సినిమాలను సుహాస్ తన లైన‌ప్‌లో పెట్టాడు. అందులో ‘శ్రీరంగనీతులు’ మూవీ ఒకటి.

సుహాస్, కార్తీక్ రత్నం, విరాజ్ అశ్విన్, రుహాని శర్మ కలిసి నటిస్తోన్న ఈ మూవీ నుంచి ఇటీవల సాంగ్, ట్రైలర్ రిలీజ్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రవీణ కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఏప్రిల్ 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమానే కాదండోయ్ మరో సినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. తన లైనప్‌ ఉన్న మరో మూవీ ‘ప్రసన్న వదనం’. ఈ మూవీ టీజర్‌ని ఇటీవలే రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి అర్జున్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో పాయల్ రాధాకృష్ణ, రాశిసింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Also Read: నితిన్ బర్త్‌డే స్పెషల్.. పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్‌తో కొత్త సినిమా పోస్టర్ రిలీజ్

ఇక ఇన్ని మూవీలను తన లైనప్‌ ఉంచుకుని సుహాస్ మరొక సినిమాను ప్రకటించేశాడు. ఇప్పుడు మరొక కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగా ఇవాళ సుహాస్ నటించబోయే కొత్త సినిమా టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ మేరకు ఈ చిత్రానికి గానూ ‘ఓ భామ అయ్యో రామ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి రామ్ గోదల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో సుహాస్‌కు జోడీగా మాళవిక మనోజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే ‘జో’ సినిమాలో నటించి అదరగొట్టిన మళవిక మనోజ్ ఇప్పుడు ఈ మూవీలో నటించే అవకాశాన్ని అందుకుంది. ఈ మూవీ షూటింగ్‌ త్వరలో స్టార్ట్ కాబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.

Tags

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×