E-Paper
Advertisement

Ooru Peru Bhairavakona: ఊరుపేరు భైరవకోన ఫస్ట్ డే కలెక్షన్స్.. 45రోజుల తరువాతే ఓటీటీలోకి!

Ooru Peru Bhairavakona: ఊరుపేరు భైరవకోన ఫస్ట్ డే కలెక్షన్స్.. 45రోజుల తరువాతే  ఓటీటీలోకి!
Advertisement

Ooru Peru Bhairavakona OTT Release Date: యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ఊరుపేరు భైరవకోన’. కావ్యా థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. ఫాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

భైరవకోన అనే గ్రామంలో అడుగుపెట్టిన వారు ఎవరూ మళ్లీ తిరిగి ప్రాణాలతో బయటకువచ్చిన దాఖలాలు ఉండవు. అయితే బసవ (సందీప్ కిషన్), అతడి ఫ్రెండ్స్ జాన్ (వైవా హర్ష), గీత (కావ్య థాపర్) కలిసి అదే గ్రామంలోకి వెళతారు. ఆ తర్వాత దొంగతనం చేసి తప్పించుకునే క్రమంలో వారికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి.. బైరవకోన నుంచి వారు ప్రాణాలతో ఎలా బయటపడ్డారు? ఎందుకు దొంగతనం చేయాల్సి వచ్చింది అన్నదే ఈ మూవీ స్టోరీ.

Advertisement

కాగా రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచే ఈ మూవీపై పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ మూవీ చూసేందుకు ఆడియన్స్ థియేటర్లకు పరుగులు తీశారు. ఇక తొలిరోజు ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఏకంగా రూ.6 కోట్ల వరకు గ్రాస్ రాబట్టినట్లు చిత్రబృందం తాజాగా తెలిపింది. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా నైజాం ఏరియాలో కోటిన్న‌ర వ‌ర‌కు ఈ మూవీ వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది.

READ MORE: ఊరు పేరు భైరవకోన ప్రీమియర్స్ రివ్యూ.. సందీప్‌కు హిట్టు పడినట్లేనా..!

Advertisement

దీంతో ‘ఊరుపేరు భైరవకోన’ సినిమా సందీప్ కిషన్ కెరీర్‌లో ఫస్ట్ డే హయ్యెస్ట్ వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు పదిన్నర కోట్ల వరకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయి అందరినీ ఆశ్చర్యపరచింది. దీంతో ఈ చిత్రం రూ.11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్కెట్‌తో వచ్చింది.

మొదటి రోజు రూ.6.3 కోట్ల వరకు గ్రాస్, రూ.3.5 కోట్ల వరకు షేర్ కలెక్షన్లను ఈ మూవీ రాబట్టింది అబ్బురపరచింది. ఇక లవర్స్ డే రోజు ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ప్రీమియర్స్ వేయగా.. అక్కడ కోటి పది లక్షల వరకు కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఫస్ట్ డే వసూళ్లు, ప్రీమియర్స్‌తో కలిపి ఈ సినిమా రూ.7.20 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. మరి ఈ సినిమా లాభాల్లోకి వెళ్లాలంటే ఇంకొన్ని కోట్లు రాబట్టాల్సి ఉంటుంది.

ఊరుపేరు భైరవకోన’ ఓటీటీ:

థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీ రిలీజ్ తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట. ఇందులో భాగంగానే ఈ మూవీని రెండు నెలలు లేదా 45 రోజుల్లో స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×