BigTV English

Ooru Peru Bhairavakona Premieres Review: ఊరు పేరు భైరవకోన ప్రీమియర్స్ రివ్యూ.. సందీప్‌కు హిట్టు పడినట్లేనా..!

Ooru Peru Bhairavakona Premieres Review: ఊరు పేరు భైరవకోన ప్రీమియర్స్ రివ్యూ.. సందీప్‌కు హిట్టు పడినట్లేనా..!
Ooru Peru Bhairavakona Premieres Review

Ooru Peru Bhairavakona Premieres Review(Movie reviews in telugu): టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తోన్న కొత్త చిత్రం ‘ఊరుపేరు భైరవకోన’. ఈ సినిమా ఫిబ్రవరి 16న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో రెండ్రోజుల ముందే ఈ మూవీ ప్రీమియర్స్‌ను ప్రదర్శించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా కొన్ని ఏరియాల్లో ముందుగానే షోను ప్రదర్శించగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. దీని ప్రిమియర్స్ రివ్యూ ఎలా ఉందో చూసేద్దాం..


సందీప్ కిషన్ చాలా కాలం నుంచి మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుసపెట్టి సినిమాలు తీస్తున్నాడు. అయినా.. సరైన హిట్ అందుకోలేదు. ఈ సారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు.

ఇందులో భాగంగానే ఇప్పుడు డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సందీప్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఊరుపేరు భైరవకోన’. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 16న రిలీజ్ కానుంది.


READ MORE: ఒక ఊరి కథ.. ఒకే ఫార్ములాతో హిట్లు

ఈ తరుణంలో రెండ్రోజుల ముందు ఈ మూవీ ప్రీమియర్లు వేశారు. అయితే ఈ ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా సూపర్‌గా ఉందని కొందరు అంటుంటే.. మరికొందరెమో పర్వాలేదు అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ పర్వాలేదనేలా ఉందని టాక్. ముఖ్యంగా ఈ సినిమాకి ఇంటర్వెల్ సీన్లు హైలైట్ అని అంటున్నారు. ఈ ఇంటర్వెల్ మాత్రం ఓ రేంజ్‌లో ఉండబోతుందట.

అలాగే విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. దీనికి తోడు ఈ సినిమాలోని పాటలు సినీ ప్రేమికుల్ని మరోలోకానికి తీసుకువెళతాయని టాక్. ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకి ఆర్ఆర్ కూడా చాలా బాగుందని అంటున్నారు.

అయితే దర్శకుడు ఆనంద్ సెకండ్ హాఫ్‌ను అంత ఇంట్రెస్ట్‌గా చూపించలేకపోయారని చెబుతున్నారు. అదిరిపోయే ఇంటర్వెల్ సీన్ తర్వాత సెకండాఫ్‌ను దర్శకుడు నీరు గార్చేశాడని అంటున్నారు.

READ MORE: ‘మా తప్పు లేదు’.. రవితేజతో సందీప్ కిషన్ ఢీ!

ఇక వర్ష హీరోయిన్‌గా నటించినా.. ఆమె పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదట. కేవలం రొమాంటిక్ సీన్ల కోసమే ఆమెను వాడుకున్నారట. అయితే ఇందులో మరో హీరోయిన్‌గా కావ్యా థాపర్ నటించింది. ఇక ఆమె పాత్ర ఇందులో బాగుందని అంటున్నారు.

ఏది ఏమైనా మొత్తానికి బొమ్మ అదిరిపోయిందని చెబుతున్నారు. దర్శకుడు వీఐ ఆనంద్ మరోసారి తనదైన మార్క్ చూపించాడని అంటున్నారు. సందీప్ కిషన్‌కు భైరవకోనతో మంచి హిట్ పడిందని చెబుతున్నారు.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×