E-Paper
Advertisement

Family Star 2nd Song Promo: ‘ఫ్యామిలీ స్టార్’ నుంచి సెకండ్ సాంగ్ రెడీ.. అదిరిపోయిన పెళ్లి ప్రోమో

Family Star 2nd Song Promo: ‘ఫ్యామిలీ స్టార్’ నుంచి సెకండ్ సాంగ్ రెడీ.. అదిరిపోయిన పెళ్లి ప్రోమో
Advertisement

Vijay Devarakonda’s Family Star Movie 2nd Song Promo: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో కోలుకోలేని దెబ్బ తిన్నాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేసింది. బాక్సాఫీసు వద్ద ఊహించినంత విజయాన్ని అందుకోలేక పోయింది.

Advertisement

దీంతో విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఇందులో భాగంగా తనకు గీతా గోవిందంతో రూ.100 కోట్ల హిట్ మూవీ ఇచ్చిన దర్శకుడు పరశురామ్‌తో ఇప్పుడు మరొక సినిమా చేస్తున్నాడు.

విజయ్ దేవరకొండ – పరశురామ్ కాంబోలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈమూవీలో విజయ్ దేవరకొండకు జోడీగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Advertisement

Also Read: ఆస్కార్స్‌ సాధించిన సినిమాలు.. ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?

ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, ఒక సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. వీటితో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ వైపు మాస్ మెయింటైన్ చేస్తూనే.. మరోవైపు ఒక మిడిల్ క్లాస్‌ వ్యక్తిలా కనిపిస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి మేకర్స్ మరో అప్డేట్‌ను ప్రేక్షకులకు అందించారు. ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్‌ ప్రోమోను విడుదల చేశారు. ‘కళ్యాణి వచ్చా వచ్చా’ అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమోను వెడ్డింగ్ సాంగ్‌లా చిత్రీకరించారు.

ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా ఫుల్ లిరికల్ సాంగ్ ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ ఏడాది సమ్మర్‌లో అంటే ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×