E-Paper
Advertisement

Haryana CM Manohar Lal Khattar: హర్యానాలో రాజకీయ సంక్షోభం.. సీఎం పదవికి ఖట్టర్ రాజీనామా!

Haryana CM Manohar Lal Khattar: హర్యానాలో రాజకీయ సంక్షోభం.. సీఎం పదవికి ఖట్టర్ రాజీనామా!
Advertisement

Haryana CM Manohar Lal Khattar Resign: హర్యానాలో రాజకీయ సంక్షోభం నెలకొంది. సరిగ్గా లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీ – జేజేపీ కూటమిలో విభేదాలు తెరపైకి వచ్చాయి. లోక్ సభ సీట్లపై పొత్తు కుదరకపోవడంతో మిత్రపక్షమైన జేజేపీ.. బీజేపీతో పొత్తు తెంచుకుంది. రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరకపోవడంతో.. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ దత్తాత్రేయకు పంపారు. సీఎంతో పాటు మంత్రి మండలి సభ్యులు కూడా తమ రాజీనామా లేఖలను సమర్పించారు.

Advertisement

Also Read: దేశంలో ముస్లిం పౌరులపై CAA ప్రభావం ఉంటుందా ? ముస్లింలకు మాత్రమే ఇది ఎందుకు వర్తించదు ?

సీఎం, మంత్రి మండలి రాజీనామాలను  గవర్నర్ ఆమోదించడంతో అక్కడి కేబినెట్ రద్దయింది. ఈ రోజు మధ్యాహ్నమే కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. కొద్దిసేపటిలో బీజేఎల్పీ సమావేశం కానుంది. స్వతంత్ర ఎమ్మెల్యేల సపోర్టుతో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది.  సీఎం రేసులో నయబ్ సైనీ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. హర్యానా అసెంబ్లీ ఎన్నికలు 2019లో జరగ్గా.. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 40 సీట్లలో గెలిచింది. జేజేపీ 10 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అప్పట్లో జేజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. ఆ పార్టీ నేత మనోహర్ లాల్ ఖట్టర్ కు సీఎం పదవిని కట్టబెట్టింది. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 46 మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు కావలసి ఉంటుంది. 40 మంది ఎమ్మెల్యేలతో ఉన్న బీజేపీ.. మరికొందరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×