BigTV English

Citizenship Amendment Act 2019: దేశంలో ముస్లిం పౌరులపై CAA ప్రభావం ఉంటుందా..? ముస్లింలకు మాత్రమే ఇది ఎందుకు వర్తించదు..?

Citizenship Amendment Act 2019: దేశంలో ముస్లిం పౌరులపై CAA ప్రభావం ఉంటుందా..? ముస్లింలకు మాత్రమే ఇది ఎందుకు వర్తించదు..?


Citizenship Amendment Act: పౌరసత్వ సవరణ చట్టం తక్షణమే అమల్లోకి వస్తుందని సోమవారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సరిగ్గా లోక్ సభ ఎన్నికలకు ముందు ఎన్డీయే సర్కార్ ఈ సంచలన ప్రకటన చేయడం చర్చకు దారితీసింది. అసలు Citizenship Amendment Act వల్ల ఎవరికి లాభం ఉంటుంది ? దీని వల్ల దేశంలో ఉన్న ముస్లింల పౌరసత్వంపై ప్రభావం ఉంటుందా ? వలసదారులకు కలిగే ఉపయోగాలేంటి అన్న విషయాలపై ఓ లుక్కేద్దాం.

నిజానికి పౌరసత్వ సవరణ చట్టం 2019లోనే పార్లమెంట్ ఆమోదం పొందినప్పటికీ.. ఇప్పటివరకూ అమల్లోకి రాలేదు. అందుకు కారణం ఇప్పుడు అమల్లోకి తీసుకురావడానికి కారణం.. పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలలో మతపరమైన హింసకు గురై.. భారత్ కు వలస వస్తున్న హిందువులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు, పార్శీలు. వీరందరికీ సీఏఏతో భారత పౌరసత్వం అందించనున్నారు. మరి దీనివల్ల ముస్లింలు ఎందుకు ఆందోళన చేస్తున్నారో తెలుసా ? విదేశాల నుంచి భారత్ కు వలస వచ్చే అన్ని మతాల వారికి పౌరసత్వ హక్కును కల్పించి.. ఒక్క ముస్లింలకు మాత్రం పౌరసత్వం ఇవ్వకూడదని నిర్ణయించడమే ఆందోళనలకు దారి తీసింది. అందుకే దేశంలో ఉన్న ముస్లింలు సైతం అభద్రతా భావంతో ఉన్నారు.


సీఏఏలో ముస్లింలకు మాత్రం పౌరసత్వ హక్కును కల్పించకపోవడంపై తీవ్ర అనుమానాలు, ఆలోచనలు, భయాలు నెలకొన్నాయి. దేశంలో సీఏఏ అమల్లోకి వచ్చాక.. దేశంలోని ముస్లిం పౌరులపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది ప్రస్తుతం తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. ఈ పౌరసత్వ సవరణ చట్టంలో మనదేశంలో ఉన్న ముస్లిం పౌరులకు సంబంధించి ఏం ఉంది. కేంద్రం ఏం చెప్పింది ?

Also Read: పౌరసత్వ సవరణ చట్టం-2019 అమలుకు చర్యలు.. నోటిఫికేషన్ జారీ..

పౌరసత్వ సవరణ చట్టాన్ని కేవలం విదేశాల నుంచి భారత్ కు వలస వచ్చే వారి కోసమే రూపొందించారు. దీనివల్ల ఇప్పటికే మన దేశంలో పౌరసత్వాన్ని కలిగి ఉన్న మతాల పౌరులకు (ముస్లిం పౌరులకు కూడా) ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతోంది. పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి భారతదేశానికి వలస వచ్చిన ముస్లిమేతర పౌరులు.. అంటే హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలు, జైనులకు మాత్రమే భారత పౌరసత్వాన్ని కల్పించనున్నారు. అయితే ఆయా దేశాల నుంచి వచ్చిన ముస్లింలకు మాత్రం పౌరసత్వాన్ని అందించకపోవడం విమర్శలకు తావిచ్చింది. అందుకు కారణం హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ లోనే చెప్పేశారు. ఆయా దేశాలు ముస్లిం మెజారిటీ దేశాలని, కాబట్టి వారు హింసకు గురికాలేరన్నారు. అందుకే ఈ 3 దేశాల్లో ఉన్న హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు మతపరంగా తీవ్రమైన హింసను ఎదుర్కొంటున్నారని, అందుచేతనే వారికే సీఏఏను అమలు చేసినట్లు వివరించారు.

CAA దేశంలో ఉద్యోగ మార్కెట్‌పై ప్రభావం చూపుతుందా..?

దేశంలోని యువత ఉద్యోగం కోసం కష్టపడుతున్న తరుణంలో మోదీ సర్కార్ సీఏఏను తీసుకొచ్చిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. “అంటే పొరుగు దేశాల వాళ్ళని ఇండియాకి రప్పించి సెటిల్‌ చేయాలనుకుంటున్నారు. ఎందుకు? మన యువతకు ఉపాధి లేనప్పుడు పొరుగు దేశాల నుంచి వచ్చే వారికి ఉపాధి కల్పించేదెవరు? మీ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు ఏమైనా చేస్తారా ?” అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు.

Also Read: SBI Submits Electoral Bonds: ఇక ఈసీ వంతే..! ఎలక్టోరల్ బాండ్ల వివరాలు సమర్పించిన ఎస్‌బీఐ

అయితే.. CAA రూల్‌లో పేర్కొన్నట్లుగా 2014 కంటే ముందు భారతదేశంలోకి వచ్చి స్థిరపడిన వారికి మాత్రమే ఈ నిబంధన ప్రకారం పౌరసత్వం లభిస్తుంది. అందువల్ల CAA పొరుగు దేశాల నుండి తాజా శరణార్థులను ఆహ్వానించదు. 2014 కి ముందు భారతదేశంలోకి ప్రవేశించిన వారు మనుగడ కోసం ఇప్పటికే ఏదొక పని చేస్తున్నారు. అందుకే భారతీయ పౌరసత్వం వారి శరణార్థ స్థితిని ముగించి గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి వారికి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి.. వారికి పౌరసత్వాన్ని కల్పించడం వల్ల భారతీయ జాబ్ మార్కెట్‌పై ఒత్తిడి ఉండదని కేంద్రం చెబుతోంది.

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×