E-Paper
Advertisement

Samantha Second Marriage: రెండో పెళ్లికి సిద్ధమైన సమంత.. కానీ ఆ కండిషన్స్ తప్పవటా..!

Samantha Second Marriage: రెండో పెళ్లికి సిద్ధమైన సమంత.. కానీ ఆ కండిషన్స్ తప్పవటా..!
Advertisement

Samantha’s Second Marriage Rumors: సినీ ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి.. ఆఖరికి విడాకులు.. ఇప్పుడివే ఎక్కువగా వినిపిస్తున్న పదాలు. ఎంతో కాలం ప్రేమించుకున్న సెలబ్రెటీ జంటలు.. పెళ్లయ్యాక మాత్రం అన్యోన్యంగా కలిసి ఉండలేకపోతున్నారు. దీంతో విడాకులు తీసుకుని ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారు. ఈ వ్యవహారం రోజు రోజుకూ పెరిగిపోతుంది. సెలబ్రెటీస్ ఎంత వేగంగా పెళ్లి చేసుకుంటున్నారో.. అంతే వేగంగా విడాకులు తీసుకుంటున్నారు.

అయితే ఇప్పటి వరకు టాలీవుడ్‌, బాలీవుడ్, కోలీవుడ్‌కు సంబంధించిన సెలబ్రెటీస్ పెళ్లయ్యాక బ్రేకప్ చెప్పుకున్నవాళ్లు ఉన్నారు. అలాగే పెళ్లి వరకు వచ్చి విడిపోయిన జంటలు కూడా చాలానే ఉన్నాయి. అందులో టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్‌గా పేరు సంపాదించుకున్న సమంత, నాగచైతన్య ఒకరు.

Advertisement

ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట సడెన్‌గా విడిపోవడంతో అంతా షాకయ్యారు. ఇక విడాకుల అనంతరం సమంత, నాగచైతన్యకు సంబంధించిన ఎలాంటి వార్త అయిన ఇట్టే చర్చనీయాంశం అవుతుంది.

READ MORE: Samantha : ‘నేను చేసిన అతి పెద్ద తప్పు అదే..’ వైవాహిక జీవితంపై సమంత కామెంట్స్..

Advertisement

ఈ జంట విడాకులను ఇప్పటికీ వారి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఈ జంట ఒక్కటైతే చాలు అంటూ కోరుకున్నవారు కూడా ఉన్నారు. ఇక విడాకుల అనంతరం సమంత, నాగ చైతన్య ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. వరుస పెట్టి సినిమాలు తీస్తూ ప్రేక్షకాభిమానులను అలరిస్తున్నారు.

ఇక ఫలితాలతో సంబంధం లేకుండా సమంత దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఆ మధ్య మయోసైటిస్ వ్యాధితో ఆమె తీవ్ర ఇబ్బంది పడింది. ఈ వ్యాధి కారణంగా ఆమె సినిమాలకు కొద్దిరోజులు బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ కోలుకుని సినిమాలపై ఫోకస్ పెట్టింది.

ఇదిలా ఉంటే తాజాగా సమంతకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. నిన్న మొన్నటి వరకు విడాకులతో వార్తల్లో నిలిచిన సమంత.. ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమైందంటూ కొన్ని వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఆ అబ్బాయి కూడా తమ బంధువుల అబ్బాయి అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

READ MORE: Samantha: ఓ స్టార్ హోటల్లో నెలకు రూ.500 జీతానికి పనిచేశా: సమంత

అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సామ్ టీం ఇప్పటికే ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చినా.. ఈ వార్తలకు బ్రేక్ పడలేదు. కాగా సమంత కుటుంబ సభ్యులు ఆమెను పెళ్లి చేసుకోమని తెగ పట్టుబడుతున్నారట. దీంతో వాళ్ల ఒత్తిడి వల్లే సమంత రెండో పెళ్లికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ సారి సామ్ కుటుంబ సభ్యులు.. వారి దగ్గరి బంధువలు అబ్బాయితోనే సమంతకు పెళ్లి చేయాలని చూస్తున్నారట.

అయితే ఈ పెళ్లికి సామ్ చాలా కండీషన్స్ పెట్టినట్లు సమాచారం. దీనిపై క్లారిటీ లేకపోయినప్పటికీ.. ఈ వార్తలు ప్రస్తుతం జోరుగా సాగుతూనే ఉన్నాయి. మరి ఈ వార్తలపై సామ్ టీం స్పందించినప్పటికీ.. ఆగకపోవడంతో.. సమంత ఏమైనా నేరుగా స్పందించి క్లారిటీ ఇస్తుందేమో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×