BigTV English

Director Krish: రాడిసన్ డ్రగ్స్ కేసు.. పరారీలో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్!

Director Krish: రాడిసన్ డ్రగ్స్ కేసు.. పరారీలో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్!

Director krish drugs case


Director krish drugs case(Tollywood celebrity news): గచ్చిబౌలిలోని రాడిసన్‌ హోటల్‌ డ్రగ్‌ కేసులో ఇప్పటికే పోలీసులు చాలా మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ నిందితుల్లో ఒకరైన టాలీవుడ్ డైరెక్టర్‌ క్రిష్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలియజేసింది.

దీంతో ఈ విచారణ కీలక మలుపు తిరిగింది. పోలీసులు ప్రస్తుతం దర్శకుడు క్రిష్ కోసం వెతుకుతున్నారు. కాగా అతనిపై సిఆర్‌పిసి 160 కింద కేసు కూడా నమోదు చేసి కోర్టుకు తెలిపారు. ఇకపోతే మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


అందులో వివేక్‌ డ్రైవర్‌ గద్దల ప్రవీణ్‌, డ్రగ్స్‌ సరఫరాదారు మీర్జా వాహిద్‌ బేగ్‌లను వరుసగా 11, 12 మంది నిందితులుగా చేర్చినట్లు తెలిపారు. కాగా డ్రగ్స్‌ పెడ్లర్‌ సయ్యద్‌ అబ్బాస్‌ అలీ రిమాండ్‌ రిపోర్టులో రాడిసన్‌ హోటల్‌ను ఈ కేసులో నిందితులు డ్రగ్స్‌ తీసుకోవడానికి తరచు ఉపయోగించే విధానం వెలుగుచూసింది.

READ MORE: డైరెక్ట‌ర్ క్రిష్ కొత్త లుక్‌.. షాక్ అవుతున్న నెటిజ‌న్స్‌

అంతేకాకుండా నిందితుడు వివేక్ ఏడాది క్రితమే మత్తు పదార్థాలకు బానిసయ్యాడని పోలీసులు పేర్కొన్నారు. దర్శకుడు క్రిష్, నిర్భయ్ సింధీతో కలిసి హోటల్‌లో డ్రగ్స్‌ సేవించినట్లు సమాచారం. ఫిబ్రవరి 24న జరిగిన డ్రగ్స్ పార్టీలో శ్వేత, లిస్సీ, నీల్‌తో పాటు క్రిష్ కూడా పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.

క్రిష్, నిర్భయ్ తరచుగా రాడిసన్ హోటల్‌లో కలుసుకున్నారని కూడా ఓ నివేదిక పేర్కొంది. బేగ్ నుంచి ఒక గ్రాము కొకైన్‌ను రూ.14,000కు కొనుగోలు చేశారని.. బేగ్ డ్రగ్స్‌ని వివేక్‌ డ్రైవర్‌ గద్దల ప్రవీణ్‌కు బదిలీ చేసేవాడని తెలుస్తోంది.

ఇకపోతే 2 గ్రాముల పదార్థానికి ప్రవీణ్ ద్వారా రూ.32 వేలు బేగ్‌కు చెల్లించినట్లు గుర్తించారు. ఫిబ్రవరి 24న వివేక్, రఘుచరణ్, కేదార్నాథ్, సందీప్, శ్వేత, లిస్సీ, నీల్, దర్శకుడు క్రిష్ పేపర్ రోల్స్ సహాయంతో 3 గ్రాముల కొకైన్ సేవించినట్లు వార్తలు వస్తున్నాయి.

READ MORE: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ డైరెక్టర్.. పోలీసులు క్లారిటీ!

హోటల్‌లో రూమ్ నెంబర్ 1200, 1204 గదులను అద్దెకు తీసుకుని డ్రగ్స్ సేవించినట్లు నిందితులు అంగీకరించారు. ఇక ఈ కేసు ఎంతవరకు దారితీస్తుందో చూడాలి.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×