E-Paper
Advertisement

KGFలో యష్ క్యారెక్టర్‌పై టాలీవుడ్ డైరెక్ట‌ర్ సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌.. ఏకి పారేస్తున్న నెటిజ‌న్స్‌

KGFలో యష్ క్యారెక్టర్‌పై టాలీవుడ్ డైరెక్ట‌ర్ సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌.. ఏకి పారేస్తున్న నెటిజ‌న్స్‌
KGF

KGF : ఎవ‌రి సినిమాలు వాళ్ల‌కి ముద్దు.. ఎవ‌రి హీరోలు వాళ్ల‌కి గొప్ప‌గా ఉంటారు. అది డైరెక్ట‌రో, నిర్మాత‌నో, లేదా ఇంకేవ‌రైనా టెక్నీషియ‌న్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావ‌చ్చు. కానీ ప్రేక్ష‌కుడికి ఇవేవీ ప‌ట్ట‌వు. కంటెంట్ బావుంటే చాలు. భాష‌తో సంబంధం లేకుండా సినిమాను స‌క్సెస్ చేసేస్తారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మ‌న ద‌క్షిణాది సినిమాలే. ఒక‌ప్పుడు ఇండియన్ సినిమాలంటే బాలీవుడ్ సినిమాల‌నే భావించేవారు బ‌య‌టివారు. కానీ బాహుబ‌లి నుంచి లెక్కలు మారిపోయాయి. సౌత్ సినిమాలు రాజ్య‌మేల‌టం మొద‌ల‌య్యాయి. పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. గ‌త ఏడాది విడుద‌లైన ఆర్ఆర్ఆర్‌, కె.జి.య‌ఫ్ 2, కాంతార చిత్రాలే ఉదాహ‌ర‌ణ‌లు.

KGF 2 విష‌యానికి వ‌స్తే.. బాహుబ‌లి 2 త‌ర్వాత ఇండియా రేంజ్‌లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఆ సినిమా టేకింగ్, హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌, ఎలివేష‌న్ అన్నీ జ‌నాల‌కు అంత బాగా న‌చ్చేశాయి. అలాంటి సినిమాపై టాలీవుడ్‌కి చెందిన యంగ్ డైరెక్టర్ వెంక‌టేష్ మ‌హ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఓ యూట్యూబ్ ఇంట‌ర్వ్యూలో వెంక‌ట్ మ‌హాతో పాటు మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి, వివేక్ ఆత్రేయ‌, నందినీ రెడ్డి, శివ నిర్వాణ పాల్గొన్నారు. వారు క‌మ‌ర్షియ‌ల్ సినిమాల గురించి మాట్లాడే సంద‌ర్బంలో వెంక‌ట్ మ‌హ చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్ అయ్యాయి. ఇంత‌కీ వెంక‌ట్ మ‌హ ఏమ‌న్నాడంటే..

‘‘నేను సినిమా పేరు చెప్ప‌ను. కానీ ప్రపంచంలో ఏ తల్లి అయినా కొడుకుని గొప్ప వాడివి కావాలిరా అంటే బాగా సంపాదించి న‌లుగురుకి ఉప‌యోగ‌ప‌డు అని అర్థం. కానీ KGF విష‌యంలో నాకొక ప్ర‌శ్న ఉండిపోయింది. అదేంటంటే త‌ల్లి కొడుకుతో అంత కావాల‌ని అంటుంది. (చేతుల‌తో అంత అని సింబాలిక్‌గా చూపిస్తూ) అలాంటి అలాంటి మ‌హాత‌ల్లిని క‌ల‌వాల‌నుంది నాకు. ఆమె చెప్పిన‌ ఆ అంత‌ను త‌వ్వి తోడే వాళ్లు ఉంటారు. వీడెళ్లి వాళ్ల‌ను ఉద్ద‌రిస్తాడు. త‌ర్వాత ఓ పాట వ‌స్తుంది. ఆడు.. వాళ్ల‌కి ఇందిర‌మ్మ ప‌థ‌కంలో ఇళ్లులిచ్చి మొత్తం తీసుకెళ్లి ఎక్క‌డో పార‌దొబ్బుతాడు.అలాంటి నీచ్ క‌మీన్ కుత్తే ఎవ‌రైనా ఉంటాడా? అలాంటి కుత్తే అవ‌మ‌ని త‌ల్లి అడిగితే, అలాంటి క‌థ‌ల‌ను మ‌నం సినిమాగా తీస్తే మ‌నం చప్ప‌ట్లు కొడుతున్నాం’’ అంటూ అన్నాడు. అయితే ఎక్క‌డా వెంక‌టేష్ మ‌హ కె.జి.య‌ఫ్ సినిమా పేరుగానీ, హీరో య‌ష్ పేరుని కానీ ప్ర‌స్తావించ‌లేదు. అయితే అత‌ను చెప్పిన పాయింట్‌, మాట్లాడిన తీరు చూస్తే టార్గెట్ KGF అని చిన్న పిల్లాడైనా చెప్పేస్తాడు.

వెంక‌టేష్ మ‌హ KGFపై చేసిన కామెంట్స్ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇంకేముంది క‌న్న‌డ సినిమా అభిమానులు, య‌ష్ అభిమానులు, ఇత‌ర నెటిజ‌న్స్ నువ్వేం గొప్ప సినిమాలు తీశావు. తీసిందే రెండు. అందులో ఒక‌టి రీమేక్ అని అంటూ ట్రోల్ చేస్తున్నారు. మ‌రి ఈ వివాదంపై వెంక‌టేష్ మ‌హ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×