BigTV English

The Moon : చంద్రుడిపై టైమ్ ఎంత..? తెలుసుకునే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు..

The Moon : చంద్రుడిపై టైమ్ ఎంత..? తెలుసుకునే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు..
The Moon :

The Moon : భూమి గుండ్రంగా తిరుగుతూ ఉండడం వల్ల ఒక దేశంలో ఉండే టైమ్‌కు, ఇంకో దేశంలో ఉండే టైమ్‌కు మార్పులు ఉంటాయి. ఒక దేశంలో పగలు అయితే.. మరో దేశంలో రాత్రి అవుతుంది. ఈ టైమ్ ఛేంజ్ వెనుక పెద్ద సైన్సే ఉందని తెలిసిన విషయమే. అయితే భూమి మీదే టైమ్ విషయంలో ఇన్ని మార్పులు ఉంటే.. చంద్రుడిపై ఎన్ని మార్పులు ఉంటాయో అని యూరోప్ శాస్త్రవేత్తలకు సందేహం కలిగింది. అందుకే వారు ఓ కొత్త పరిశోధనను ప్రారంభించారు.


తాజాగా యూరోపియన్ స్పేస్ ఏజెన్స్ (ఎసా).. నెథర్‌ల్యాండ్స్‌లోని స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీతో సమావేశమయ్యింది. ఈ సమావేశంలో చంద్రుడిపై ఒక ప్రత్యేకమైన టైమ్ జోన్‌ను ఏర్పాటు చేయడంపై చర్చలు జరిగాయి. చంద్రుడిపై కమ్యూనికేషన్, నేవిగేషన్ లాంటివి మెరుగుపరచడానికి ఈ టైమ్ జోన్ ఏర్పాటు చాలా ముఖ్యమని ఎసా భావిస్తోంది. ఇప్పటికే చంద్రుడిపై శాటిలైట్ల లాంచ్‌కు ఎన్నో దేశాలు సన్నాహాలు చేస్తున్నాయి. వీటన్నింటికి టైమ్ జోన్ ఏర్పాటు తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు.

చంద్రుడిపై పరిశోధనలు చేయాలంటే స్పేస్ క్రాఫ్ట్, కంట్రోలర్స్ లాంటి వాటి సాయం అవసరం. భూమిపై నుండి వెళ్లే సూచనల ద్వారానే అక్కడ శాటిలైట్లు.. వాటి స్థానాలను ఫిక్స్ చేసుకుంటాయి. ప్రస్తుతం చంద్రుడిపై జరుగుతున్న ఆపరేషన్లు.. శాటిలైట్లు లాంచ్ అయిన దేశ టైమ్ జోన్‌ను బట్టి జరుగుతున్నాయి. ఒకేసారి చాలా దేశాలు చంద్రుడిపై తమ ఆపరేషన్స్ చేయాలి అనుకున్నప్పుడు టైమ్ జోన్ విషయంలో ఇబ్బందులు కలుగుతాయి. అందుకే ఎసా చంద్రుడిపై టైమ్ జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.


ఇప్పటికే ఎసా.. నాసాతో ఎన్నో ల్యూనార్ మిషిన్లతో పాటు ఇతర ప్రాజెక్ట్స్ విషయంలో కలిసి పాల్గొంటోంది. ఇప్పటికే నాసా తయారు చేసిన ఒరియన్ స్పేస్‌క్రాఫ్ట్ విషయంలో ఎసా.. తగిన సాయం చేసింది. అంతే కాకుండా నాసా గేట్‌వే ప్రాజెక్ట్‌లో కూడా ఎసా భాగమయ్యింది. అందుకే ఎసా, నాసాతో పాటు మరెన్నో ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీలు కూడా చంద్రుడిపై టైమ్ జోన్ ఏర్పాటులో పాల్గోనున్నాయి. ల్యూనార్ టైమ్ జోన్ ఏర్పాటు అంతర్జాతీయంగా అన్ని స్పేస్ ఏజెన్సీలకు ఉపయోగపడుతుందని ఎసా భావిస్తోంది.

టైమ్ జోన్ ఏర్పాటు అయితే కమ్యూనికేషన్, నావిగేషన్‌కు మాత్రమే కాకుండా ఎన్నో ల్యూనార్ మిషిన్స్ పనితనాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని ఎసా చెప్తోంది. ఇప్పటికే ఒక ఇంటర్నేషనల్ టీమ్.. ఈ విషయంలో తగిన ప్రయోగాలు మొదలుపెట్టిందని ఎసా తెలిపింది. కానీ చంద్రుడిపై టైమ్ జోన్ ఏర్పాటు విషయంలో టెక్నికల్‌గా ఎన్నో ఇబ్బందులు కూడా ఉన్నాయి. భూమిపై కంటే చంద్రుడి మరింత వేగంగా వాచ్‌లు పనిచేస్తాయి. ఇది మాత్రమే కాకుండా.. మరెన్నో తేడాలు కూడా ఉన్నాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ టైమ్ జోన్ ఏర్పాటు జరగనుంది.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×