BigTV English

Samantha: అతడితో డేటింగ్ లో ఉన్న సమంత.. ఇదిగో ప్రూఫ్ అంటూ..!

Samantha: అతడితో డేటింగ్ లో ఉన్న సమంత.. ఇదిగో ప్రూఫ్ అంటూ..!

Samantha:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ‘ఏ మాయ చేసావే’ అనే సినిమా ద్వారా అడుగుపెట్టి, భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది సమంత(Samantha). ముఖ్యంగా మహేష్ బాబు (Maheshbabu) ‘దూకుడు’ తర్వాత వరుస స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. ఆ తర్వాత నాగచైతన్య (Naga Chaitanya) ను పెళ్లి చేసుకున్న ఈమె పెళ్లయిన నాలుగేళ్లకే భర్తకు విడాకులు ఇచ్చి దూరమైంది. అదే సమయంలో ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది. ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సమంత, ఈ సమస్య నుంచి బయటపడడానికి ఎన్నో రోజులు తీసుకుంది. అంతే కాదు విదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకుంది. దీనికి తోడు సద్గురు జీ ని కలిసి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసింది. ఇక చివరిగా విజయ్ దేవరకొండ (Vijay deverakonda)తో కలిసి ‘ఖుషీ’ అనే సినిమాలో నటించిన ఈమె, ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది.


రాజ్ తో సమంత డేటింగ్ చేస్తోందా..?

ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరమైన సమంత.. ఇటీవల ‘సిటాడెల్ – హనీ బన్నీ’ వెబ్ సిరీస్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో తన యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేసింది సమంత. ఇదిలా ఉండగా సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru) తో ప్రేమలో ఉంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సమంత నాగచైతన్యతో వివాహం జరిగిన తర్వాత బాలీవుడ్ వెబ్ సిరీస్ ‘ ది ఫ్యామిలీ మెన్ 2’ లో ఎప్పుడూ నటించని రీతిలో నటించి ఆశ్చర్యపరిచింది. ఈ వెబ్ సిరీస్ కి కూడా రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఈమె చాలా అసభ్యకరంగా నటించడం వల్లే నాగచైతన్య గొడవ పెట్టుకొని ఈమెను దూరం చేసుకున్నారని వార్తలు కూడా వినిపించాయి. అయితే ఆ వెబ్ సిరీస్ దర్శకుడు తో మళ్ళీ మళ్ళీ వెబ్ సిరీస్ లు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది సమంత. ఈ క్రమంలోనే సమంత రాజ్ తో డేటింగ్ చేస్తోందని, అతడితో నే ఏడడుగులు వేయబోతుందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కానీ దీనిపై ఇద్దరూ స్పందించలేదు. వాస్తవానికి రాజ్ కు ఇప్పటికే పెళ్ళై , పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం.


రాజ్ చేయి పట్టుకున్న సమంత..

అయితే ఈ ఫొటోలలో దర్శకుడు రాజ్ నిడిమోరు కూడా ఉండడం.. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న విషయం. సమంత, రాజ్‌లు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కలిసి కనిపిస్తున్నారు. గతంలో రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘సిటాడెల్: హనీ బానీ’ సిరీస్‌లలో సమంత ప్రధాన పాత్రలో నటించింది. దీంతో వారి మధ్య స్నేహం ఏర్పడిందని తెలుస్తోంది. అయితే ఇటీవల వీరిద్దరు ఎక్కడ చూసినా జంటగానే కనిపిస్తుండడంతో డేటింగ్ వదంతులు షికార్లు చేస్తున్నాయి. సమంత ఇటీవల ‘పికిల్‌బాబ్ టోర్నమెంట్’లో పాల్గొంది. ఈ టోర్నీలో సమంతతో పాటు రాజ్ కూడా కనిపించాడు. ఈ సందర్భంగా ఇద్దరూ చెట్టపట్టాలేసుకుని కనిపించడంంతో మరోసారి డేటింగ్ వార్తలు ఊపందుకున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లైవ్ లో సమంతకు స్వయంగా రాజ్ నుంచి మెసేజ్ వచ్చిందని, దీంతో సామ్ తెగ సిగ్గుపడిపోయిందన్న గుసగుసలు వినిపించాయి. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. రాజ్‌కి ఇప్పటికే పెళ్లయింది. అతను శ్యామాలి డేని వివాహం చేసుకున్నాడు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×