Tollywood: అమెరికాలో ట్రంప్ (Trump) ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో అప్పటినుండి ఆ దేశానికి వలస వెళ్లిన వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఎప్పుడు ఏ సమయంలో ఎవరిపై వేటు పడుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అక్కడ నివసిస్తున్నారు. ఇప్పటికే అక్రమ వలసదారులను వెతికి మరీ పట్టుకుంటున్నారు పోలీసులు. ముఖ్యంగా యూఎస్ కి మన తెలుగు రాష్ట్రాల నుండి చాలామంది చదువు కోసం వెళ్తూ ఉంటారు. అలా చాలామంది విద్యార్థులు చదువుకుంటూనే పాకెట్ మనీ కోసం రెస్టారెంట్లలో, పెట్రోల్ బంకుల్లో,సూపర్ మార్కెట్లలో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పటినుండి అవన్నీ చేయడం కుదరదు. ట్రంప్(Trump) ఆజ్ఞ ప్రకారం.. అలా పార్ట్ టైం వర్క్ చేసే వారు ఇప్పటినుండి ఆ పని చేయడానికి వీల్లేదు. కేవలం చదువుకోవడమే పని. పార్ట్ టైం జాబ్ చేయడానికి వీల్లేదు. అలాగే ఫిబ్రవరి 28 తర్వాత పుట్టే పిల్లలకు అమెరికా సభ్యత్వం వర్తించదని ఆ పుట్టే పిల్లల్లో ఎవరో ఒకరు అమెరికా వాసులై ఉండాలని, గ్రీన్ కార్డు ఉండాలంటూ ఇలా ఎన్నో షరతులు పెట్టడంతో.. అమెరికాకు వలస వెళ్లిన చాలామందిని భయపడుతున్నారు.
వలస విద్యార్థులపై ట్రంప్ కఠిన ఆంక్షలు..
అయితే అలాంటి ట్రంప్ మూలంగా టాలీవుడ్ ఇండస్ట్రీ(Tollywood Industry)పై కూడా భారీ దెబ్బ పడనుందని తెలుస్తోంది. మరి ఇంతకీ ట్రంప్ ఎఫెక్ట్ తో టాలీవుడ్ ఎందుకు లాస్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం.. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డైరెక్టర్లు తాము చేసే సినిమాలను పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా అనేది ఫ్యాషన్ గా మారిపోవడం కారణంగా చిన్న హీరోని పెట్టయినా సరే భారీ బడ్జెట్ పెట్టి పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు తెరకెకిస్తున్నారు. ఇక పాన్ ఇండియా అంటే అన్ని భాషలలో, ఇతర దేశాలలో కూడా విడుదలవుతాయి. అలా మన తెలుగు సినిమాలు ఎన్నో కేవలం ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా విడుదలై సంచలనం సృష్టించాయి. అలా జపాన్, చైనా, అమెరికా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దేశాలలో మన తెలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి.
ట్రంప్ దెబ్బకు తెలుగు నిర్మాతలు విలవిల..
అయితే ట్రంప్(Trump) ఎఫెక్ట్ తో టాలీవుడ్ ఇండస్ట్రీకి అమెరికాలో భారీ దెబ్బ తగలబోతుంది. ఎందుకంటే ట్రంప్ తమ దేశంలోని వారికే ముందుగా ప్రాధాన్యత ఇచ్చి వలసదారులకు ఎన్నో కఠిన ఆంక్షలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చదువు కోసం వచ్చిన విద్యార్థులు పార్ట్ టైం జాబ్ చేయకూడదు అని కరాఖండిగా చెప్పేశారు. అయితే మన పాన్ ఇండియా సినిమాలు అమెరికాలో అంత హిట్ అవుతున్నాయి అంటే అది ఇక్కడి నుండి వలస వెళ్లిన విద్యార్థుల ప్రభావమే.. వాళ్లు పార్ట్ టైం జాబ్ లు చేసుకుంటూ వచ్చిన డబ్బులతో నెలకొక సినిమా అయినా కచ్చితంగా చూస్తారు. కానీ ట్రంప్ పెట్టిన కఠిన ఆంక్షల కారణంగా ఇప్పటినుండి పార్ట్ టైం జాబ్ చేయడానికి వీల్లేదు. అలాంటి సమయంలో వారు చదువుకోడానికే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక ఈ టైంలో సినిమాలు చూడడానికి వారికి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి. ఇక ఈ కారణంగా తెలుగు సినిమాల(Telugu Movies ) కలెక్షన్లపై అమెరికాలో పెద్ద దెబ్బ పడుతుంది.అందుకే సౌత్ సినిమాలను కొని అమెరికా డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇప్పుడెందుకు వచ్చిన తంట..ఇక్కడ తెలుగు వాళ్ళు చూడకపోతే సినిమాని కొని మనమే లాస్ అవుతాం అని సైలెంట్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది.అందుకే ట్రంప్ ఎఫెక్ట్ కారణంగా పాన్ ఇండియా సినిమాలు ముఖ్యంగా మన తెలుగు సినిమాల కలెక్షన్స్ పై భారీ ఎఫెక్ట్ పడబోతుందని, ట్రంప్(Trump) కారణంగా తెలుగు సినిమాలకు భారీ లాస్ వస్తుంది అని పలువురు మాట్లాడుకుంటున్నారు. ట్రంప్ చేసిన పనికి మన తెలుగు నిర్మాతలు తలులు పట్టుకోవడం గమనార్హం.