Daaku Maharaj: నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఏడుపదుల వయసుకు చేరువలో ఉన్నా.. వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలను మొదలుకొని పండు ముసలి వరకు బాలయ్య సినిమాలు ఇష్టపడుతున్నారు అంటే, ఆయన సినిమాలలో అటు అన్ని అంశాలు జోడిస్తూ తెరకెక్కిస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా యంగ్ డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తూ దూసుకుపోతున్న బాలయ్య..’అఖండ’ సినిమా మొదలుకొని ‘డాకు మహారాజ్ ‘ వరకు భారీ సక్సెస్ లు అందుకున్నారు అని, పెద్ద ఎత్తున పోస్టర్లు వెలుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ అందుకున్నారు బాలయ్య. సంక్రాంతి సందర్భంగా ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby kolli) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘డాకు మహారాజ్’.
ఫ్లాప్ గా నిలిచిన డాకు మహారాజ్..
ప్రగ్యా జైష్వాల్ (Pragya Jaiswal), చాందినీ చౌదరి(Chandini choudhury), శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath) , ఊర్వశి రోతేల (Urvashi Rautela) కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుందని చిత్ర బృందం సక్సెస్ మీట్ కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక ఇందులో ఈ సినిమా భారీ సక్సెస్ అయిందని, పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. కానీ క్లోజింగ్ కలెక్షన్లు ముగిసే సరికి ఈ సినిమా నష్టాల్లో నిలిచిందని సమాచారం. ఈ సినిమాకి మిగిలిన నష్టాలు చూస్తే.. నిజంగా డాకు మహారాజ్ కు ఇంత నష్టం వచ్చిందా అని అనకమానరు. బాలకృష్ణ డాకు మహారాజ్ రూ.82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా.. ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా రూ.64 కోట్లు వచ్చాయి. ఇక దీనిని బట్టి చూస్తే ఈ సినిమా దాదాపు రూ .18 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఇక ముగిసిన క్లోజింగ్ కలెక్షన్స్ ని బట్టి చూస్తే డాకు మహారాజ్ సినిమా ఫ్లాప్ గా నిలిచిందని చెప్పవచ్చు.
బాలకృష్ణ కెరియర్..
బాలకృష్ణ కెరియర్ విషయానికి వస్తే.. ఈ మధ్యకాలంలో ఆయనకు మహర్దశ పట్టుకుందని అందరూ అంటున్నారు. దీనికి తగ్గట్టుగానే 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆయనకు పద్మ భూషణ్ అవార్డు లభించింది. ఇక మరొకవైపు బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో కూడా భారీ టీఆర్పీ రేటింగ్తో దూసుకుపోతోంది. ఇప్పటికే ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న ఈ షో 3 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకోగా.. ఇప్పుడు నాల్గవ సీజన్ కూడా ఏకంగా తొమ్మిది ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. మొదట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రారంభమైన ఈ సీజన్ 4.. మొదటి ఎపిసోడ్ తర్వాత పలువురు సెలబ్రిటీలు తమ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇక్కడికి వచ్చి సందడి చేశారు. అలా బాలయ్య హీరోగా, హోస్ట్ గా భారీ సక్సెస్ అందుకున్నారని చెప్పవచ్చు. ఇకపోతే బాలయ్య సక్సెస్ అవ్వడంతో ఆయన కొడుకు మోక్షజ్ఞ (Mokshagna) ఎంట్రీ కోసం పెద్ద ఎత్తున సన్నహాలు జరుగుతున్న విషయం తెలిసిందే.’ హనుమాన్’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth varma) దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి సినిమా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. అంతేకాదు ఆ సినిమా నుండి మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వదలక పోవడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.