Tollywood: ప్రస్తుత కాలంలో టాలీవుడ్ సెలబ్రిటీ లందరూ కూడా ఎక్కువగా నార్త్ లేదా విదేశాలపై ఫోకస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎందుకంటే అక్కడ పాపులారిటీ లభించిందంటే ఎక్కడైనా సక్సెస్ అందుకోవచ్చు అనే తపన.. ఈమధ్య ప్రత్యేకించి టాలీవుడ్ సెలబ్రిటీలలో ఎక్కువ అయిపోయింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్(Allu Arjun), రామ్ చరణ్(Ram Charan), బాలకృష్ణ (Balakrishna) వంటి హీరోలు డిసెంబర్ నుంచి సంక్రాంతి వరకు వరుస పెట్టి సినిమాలను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్లను ఇక్కడ హైదరాబాద్ లేదా విజయవాడ వంటి ప్రదేశాలలో చేయకుండా ఏకంగా బాలీవుడ్ లేదా విదేశాలను టార్గెట్ గా పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే అక్కడ తమ సినిమాలకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహిస్తూ భారీ పాపులారిటీ అందుకుంటున్నారు.
అల్లు అర్జున్ – ‘పుష్ప 2’..
ఉదాహరణకు అల్లు అర్జున్.. ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన సుకుమార్(Sukumar) దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పుష్ప 2’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను బీహార్ లోని పాట్నాలో నిర్వహించి, సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు బన్నీ. అంతేకాదు ఈ ప్రాంతంలో బాలీవుడ్ హీరోలు కూడా సత్తా చాట లేకపోయారు. అలాంటిది బన్నీ ఈ ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేయడంతో బన్నీపై ప్రశంసలు వెళ్లవెత్తుతున్నాయి.
రామ్ చరణ్ – ‘గేమ్ ఛేంజర్’..
ఇకపోతే ఈయనను ఇన్స్పైర్ గా తీసుకొని మరో అడుగు ముందుకు వేశారు రామ్ చరణ్. ఆయన శంకర్ (Shankar )దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ (Game changer)సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇండియాలో కాకుండా ఏకంగా అమెరికాలో ప్లాన్ చేశారు. అమెరికాలోని కర్టిస్ కల్ వెల్ సెంటర్ , 4999 నామన్ ఫారెస్ట్, గార్ ల్యాండ్ టీ. ఎక్స్ 75040 వేదికపై డిసెంబర్ 21వ తేదీన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా ఘనంగా నిర్వహించబోతున్నారు. అంతేకాదు అక్కడ ఫిలిం డిస్టిబ్యూటర్, వ్యాపార సంస్థల అధినేత, ఛరిష్మా డ్రీమ్స్ అధినేత రాజేష్ కల్లేపల్లి ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించబోతున్నారు. అంతేకాదు ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దక్కని ఘనత ఈ సినిమాకి దక్కబోతోందని సమాచారం.
బాలయ్య – ‘డాకు మహారాజ్’
అయితే ఇప్పుడు ఈయన బాటలోనే బాలయ్య (Balayya )కూడా నడుస్తున్నట్లు సమాచారం. బాలయ్య – బాబీ (Bobby)దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 4వ తేదీన యూఎస్ఏ లోని డల్లాస్ , టెక్సాస్ లో సాయంత్రం 6 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఇలా మొత్తానికైతే టాప్ సెలబ్రిటీలందరూ కూడా తమ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లను రిలీజ్ చేయడానికి బాలీవుడ్ తో పాటు విదేశాలపై ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఈ విషయాలు కాస్త అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. మొత్తానికైతే బన్నీ బాలీవుడ్ లో రిలీజ్ చేసి సత్తా చాటారు. ఇప్పుడు రామ్ చరణ్, బాలకృష్ణ అమెరికాలో ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటారో చూడాలి.