YS Sharmila vs YS Jagan: ఏ విమర్శ వచ్చినా ఫైర్ అయ్యే వైసీపీ సైలెంట్ వెనుక కారణం అదేనా.. వరుసగా ప్రెస్ మీట్ లు నిర్వహిస్తున్న ఆ ఒక్క విషయంలో మాత్రం నో కామెంట్స్ అనేస్తున్నారట. ఏమి మాట్లాడితే ఏ తలనొప్పులు వస్తాయోనని ఆ ఒక్కటి అడక్కు అంటూ సైడ్ అయిపోతున్నారట వైసీపీ నేతలు. ఇంతకు ఇంతలా వారిని ఇరుకున పెడుతున్న ఆ ఒక్క ప్రశ్న ఏమిటో తెలుసా.. సాక్షాత్తు మాజీ సీఎం జగన్ సోదరి షర్మిళ తాజాగా చేసిన కామెంట్స్ పై మీ స్పందన ఏమిటి? ఈ ప్రశ్నకు ఇప్పటి వరకు వైసీపీ నుండి ఎటువంటి సమాధానం రాకపోవడం విశేషం.
ఇటీవల ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ మీడియా ముఖంగా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. మొన్నటి వరకు తన అన్నను అంతగా టార్గెట్ చేయని షర్మిళ ఈసారి ఏకంగా ఆయన పేరెత్తి మరీ విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. షర్మిళ మాట్లాడుతూ.. గతంలో తనపై బాలకృష్ణ ఇంటి నుండే ట్రోలింగ్ సాగిందని ఇప్పుడు వైసీపీ నేతలు అంటున్నారని, కానీ ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు తనపై జరిగిన ట్రోలింగ్ పై ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు.
అలాగే హీరో ప్రభాస్ తో తనకు సంబంధం ఉన్నట్లు వైసీపీ సైకోలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేశారని, ఆ సమయంలో జగన్ ఎందుకు నోరెందుకు మెదపలేదన్నారు. అన్నీ తన అన్న జగన్ కు తెలిసి జరిగాయని, ఇదేనా చెల్లెలిపై ప్రేమ చూపడం అంటూ ఓ దశలో షర్మిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జగన్ మీడియాతో మాట్లాడుతూ.. షర్మిళ గతంలో మాట్లాడిన వీడియోలను ప్రదర్శించారు. ఈ విషయంపై కూడా షర్మిళ ఫైర్ అయ్యారు.
జగన్ జైలుకు వెళ్ళినప్పుడు చెల్లెలు సపోర్ట్ అవసరం, అలాగే ఎప్పడు అవసరమైనా తనను ఉపయోగించుకోవడం తన అన్నకు మామూలే అంటూ వ్యాఖ్యానించారు. ఇలా షర్మిళ చేసిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారగా, ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్ గా మారింది. కానీ షర్మిళ చేసిన కామెంట్స్ పై వైసీపీ నుండి ఎటువంటి స్పందన లేకపోవడం విశేషం. మొన్న ఆస్తి తగాదాలకు సంబంధించి షర్మిళ అలా కామెంట్స్ చేయగానే, మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి పేర్ని నాని, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డిలు వరుసగా స్పందించారు. వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అదే రీతిలో షర్మిళ కూడా రివర్స్ అటాక్ చేశారు.
ప్రస్తుతం షర్మిళ చేసిన తాజా కామెంట్స్ పై స్పందించాలని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా, నో కామెంట్స్ అనేస్తున్నారట వైసీపీ లీడర్స్. అందుకు ప్రధాన కారణం అన్నా చెల్లెల మధ్య ఉన్న విభేదాలపై తాము ఏది మాట్లాడినా వివాదమైతే తమకెందుకంటూ నాయకులు సైలెంట్ అవుతున్నారని జోరుగా చర్చ సాగుతోంది. ఇలాగే సైలెంట్ గా ఉండడమే బెటర్.. మాట్లాడితే మళ్లీ వివాదం రేగుతుందని కూడా అస్సలు ఈ కామెంట్స్ పై నోరెత్తడం లేదని చర్చ. ఏదిఏమైనా షర్మిళ దెబ్బకు వైసీపీ నేతల్లో వణుకు మొదలైందని రాజకీయ విశ్లేషకుల అంచనా.