E-Paper
Advertisement

Tollywood Movie Shooting Updates: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా..?

Tollywood Movie Shooting Updates: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా..?
Advertisement

Tollywood Movie Shooting Updates: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోలు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. అయితే తమ అభిమాన హీరో సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది? ఇప్పట్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా? ప్రస్తుతం కొత్త సినిమాలు తమ హీరోలు ఏవైనా చేస్తున్నారా? ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నారు? మరి సినిమాలలో ఏ హీరోయిన్ నటిస్తున్నారు? ఇలా సినిమాకు సంబంధించి పలు ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో కూడా యంగ్ హీరోలను మొదలుకొని స్టార్ హీరోల వరకు చాలామంది తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అందులో భాగంగానే ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోంది? అని తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ఆలస్యం ఎందుకు? ఏ మూవీ షూటింగు ఎక్కడ జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం..

ప్రభాస్ – రాజాసాబ్ :

Advertisement

స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న ప్రభాస్ వరుస లైనప్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా ఆయన ప్రముఖ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ‘ రాజా సాబ్ ‘ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అజిజ్ నగర్ లో జరుగుతోంది.

ప్రభాస్ – ఫౌజీ:

Advertisement

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో ఫౌజీ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నది. ఇటలీ నుంచి వచ్చిన ప్రభాస్ ఈ మూవీ షూటింగ్లో పాల్గొన్నారు. ప్రస్తుతంసినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది..

చిరంజీవి- అనిల్ రావిపూడి: 

ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం చిరంజీవితో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ మొయినాబాద్ లో జరుగుతోంది.

పవన్ కళ్యాణ్ – ఓజీ: 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడు చూస్తామని ఎదురు చూస్తున్నా మూవీ ఓజీ.. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఓజి సినిమా షూటింగ్ ముంబై లో జరుగుతుంది.

బాలకృష్ణ – అఖండ 2:

బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘అఖండ’. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకొని , బాలకృష్ణకు ఊహించని విజయాన్ని అందించింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ అఖండ 2 తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జార్జియా దేశంలో జరుగుతుంది.

రవితేజ – మాస్ జాతర :

ప్రస్తుతం రవితేజ , భాను భోగవరపు దర్శకత్వంలో ‘మాస్ జాతర’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ 7 ఎకర్స్ లో జరుగుతోంది..

సాయి ధరంతేజ్ – సంబరాల ఏటిగట్టు :

ప్రముఖ హీరో సాయి ధరంతేజ్ హీరోగా ‘హనుమాన్’మూవీ నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం సంబరాల ఏటిగట్టు. ప్రస్తుతం ఈ షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్ లో జరుగుతోంది..

తేజ సజ్జ – మిరాయ్:

హనుమాన్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టేటస్ ని సొంతం చేసుకున్న చైల్డ్ ఆర్టిస్టు తేజ .. ప్రస్తుతం మిరాయ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగు అజీజ్ నగర్ లో జరుగుతోంది.

విశ్వక్ సేన్ – ఫంకీ :

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ , అనుదీప్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఫంకీ. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది..

అక్కినేని నాగచైతన్య – NC 24 :

అక్కినేని నాగచైతన్య, ప్రముఖ డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ఎన్సీ 24. ఇంకా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఫైర్ స్టేషన్ దగ్గర జరుగుతోంది..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×