BigTV English

Bengaluru Rave party: బెంగళూరు ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ.. ఏడుగురు యువతులతోపాటు ఐటీ నిపుణులు

Bengaluru Rave party: బెంగళూరు ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ.. ఏడుగురు యువతులతోపాటు ఐటీ నిపుణులు

Bengaluru Rave party: బెంగళూరు సిటీలో సీక్రెట్‌గా సాగుతున్న రేవ్ పార్టీని భగ్నం చేశారు సిటీ పోలీసులు.ఈ పార్టీకి అన్నివర్గాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ యవ్వారంలో 31 మందిని అరెస్ట్ చేశారు. వారిలో ఏడుగురు యువతులు, ఐటీ కంపెనీల టాప్ వ్యక్తులు, చైనా జాతీయులు సైతం ఉన్నట్లు సమాచారం.


ఆదివారం వేకువజామున బెంగళూరు శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగేశారు. ఉదయం 5 గంటల సమయంలో రేవ్ పార్టీని భగ్నం చేశారు. శనివారం రాత్రి పార్టీ మొదలైంది. రేవ్ పార్టీకి హాజరైన వారిలో చాలామంది మాదకద్రవ్యాలు తీసుకున్నట్లు తేలింది.

మొత్తం 31 మందిని అరెస్టు చేశారు బెంగుళూరు పోలీసులు. అరెస్టయిన వారిలో ఏడుగురు యువతులు, ఐటీ నిపుణులు, చైనా జాతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పార్టీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అరెస్టయిన వారి నుంచి మూడు గ్రాముల కొకైన్, ఐదు గ్రాముల హైడ్రో-గంజ, 60 గ్రాముల హషీష్, కొంత గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.


నిందితులపై నార్కోటిక్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.  రేవ్ పార్టీ సమయంలో డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తిని గుర్తించారు పోలీసులు. 31 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. రిపోర్టు వచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకోనున్నారు. మాదక ద్రవ్యాలతో పట్టుబడిన నలుగుర్ని న్యాయస్థానంలో హాజరు పరిచారు. వారికి రెండువారాల పాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారని తూర్పు డివిజన్ డీసీపీ వీజే సాజిత్ తెలిపారు.

ALSO READ: మద్యం తాగిన మైనర్, ఏకంగా వైన్ షాప్ ముందే రచ్చ

ప్రాథమిక విచారణ తర్వాత మరో 27 మందిని బెయిల్‌పై విడుదల చేశారు. ఫామ్‌హౌస్ యజమాని సహా మిగతా వారిపై NDPS చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ విషయాన్ని తూర్పు డీసీపీ వెల్లడించారు. పుట్టినరోజు వేడుకగా నిర్వహించారని, చివరకు రేవ్ పార్టీగా మారినట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌తో పట్టుబడిన విచారించారు. వాటిని సరఫరా చేస్తున్న నెట్‌వర్క్ గురించి కీలక విషయాలు తెలుసుకున్నారు.

దీనికి సంబంధించి మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.  బెంగళూరులోని బనస్వాడి ప్రాంతానికి చెందిన ఓ ఉద్యోగి తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ ఫామ్‌హౌస్ యజమాని సయ్యద్ అసద్‌ను ఆన్‌లైన్‌లో ఆ ఉద్యోగి సంప్రదించాడు. ఆ తర్వాత దానిని అతనికి అద్దెకు ఇచ్చాడు. పార్టీకి హాజరైనవారిలో ఎక్కువ మంది 24 నుంచి 30 ఏళ్ల వయస్సువారు ఎక్కువగా ఉన్నారు.

\

Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×