BigTV English
Advertisement

Nandamuri Balakrishna: మరోసారి పవన్- బాలయ్య ఒకే ఫ్రేమ్ లో..?

Nandamuri Balakrishna: మరోసారి పవన్- బాలయ్య ఒకే ఫ్రేమ్ లో..?

Nandamuri Balakrishna: నందమూరి తారక రామారావు నటవారసుడిగా తెలుగుతెరకు పరిచయమయ్యాడు నందమూరి బాలకృష్ణ. తాతమ్మ కల అనే సినిమాతో 30 ఆగష్టు 1974 న బాలయ్య మొట్టమొదటిసారి తెరపై కనిపించాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు బాలయ్య నిరంతరాయంగా నటిస్తూనే ఉన్నాడు. ఈ ఏడాది ఆగస్టు 30 వస్తే బాలయ్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తిచేసుకోనున్నాడు.


ఇక ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ మొత్తం బాలయ్యకు ఘన సన్మానం చేయనున్నారట. సెప్టెంబర్ 1 న గచ్చిబౌలి స్టేడియంలో ఈ వేడుకను ఏర్పాటు చేయనున్నారు. ఇక ఈ ఈవెంట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నట్లు తెలుస్తోంది.

పవన్ ఒక్కడే కాకుండా ఈ ఈవెంట్‌కు సినీరాజ‌కీయ రంగ ప్ర‌ముఖులు హాజ‌రుకానున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంలు – పవన్ కళ్యాణ్, భట్టి మల్లు విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రులు, ఇరు రాష్ట్రాల మంత్రులను ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానిస్తున్నారని చెప్పుకొస్తున్నారు. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు పవన్- బాలయ్య ఒకే స్టేజిమీద కనిపించే మూమెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.


నిజం చెప్పాలంటే వేడుక మొత్తంలో పవన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కూటమి ప్రచారంలో బాలయ్య- పవన్ కలిసి కనిపించారు. మరోసారి ఈ వీరు ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు ఏపీ డిప్యూటీ సీఎం గా ఒకరు.. ఎమ్మెల్యేగా మరొకరు.. ఏపీ అభివృధ్ధికోసం కృషి చేస్తున్నారు. మరి ఈ సన్మాన కార్యక్రమంలో పవన్- బాలయ్య ఎలాంటి స్పీచ్ ఇస్తారో చూడాలి.

Related News

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Big Stories

×