BigTV English

Tragedy In Telugu Movie Industry: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నిర్మాత సతీమణి కన్నుమూత

Tragedy In Telugu Movie Industry: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నిర్మాత సతీమణి కన్నుమూత

Telugu Movie Industry Producer Wife Passed away: సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి సతీమణి వరలక్ష్మి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల అనారోగ్యం క్షీణించడంతో ఇటీవల ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇంతలోనే ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో బుధవారం రాత్రి మృతి చెందింది.


ఈ విషయం తెలుసుకున్న తన సోదరుడు నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఉదయం హైదరాబాద్ బయలుదేరారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు, టీడీపీ నాయకులు సంతాపం ప్రకటించారు. కాగా, వరలక్ష్మి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమార్తె.

మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమార్తె వరలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూమార్తెలు ఉన్నారు. అయితే తెలుగులో తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అంజి, అరుంధతి వంటి సినిమాలకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. గత కొంతకాలంగా కాన్సర్‌తో బాధపడుతున్న శ్యామ్ ప్రసాద్ రెడ్డి భార్య వరలక్ష్మి మరణించడంతో పలువురు సినీ సెటబ్రిటీలు, టీడీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


Also Read: నేను డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి రాలేదు.. కానీ, ఎందుకు అయ్యాను అంటే.. ?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితోపాటు అల్లు అరవింద్, దిల్ రాజు ఉదయం శ్యాంప్రసాద్ నివాసానికి చేరుకొని నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కాగా, సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సన్నిహితులు తెలిపారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×