Coolie:”మోనికా” సాంగ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పిల్లల్ని మొదలుకొని పెద్దల వరకూ.. సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీల వరకు చాలామంది ఈ పాటకు రీల్స్ చేస్తూ తెగ ట్రెండ్ చేస్తున్నారు. అలా ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చేసిన ఈ పాట ట్రెండ్ సెట్ చేసింది అని చెప్పవచ్చు.
ఇకపోతే ఈ పాట మోనిక బెలూచీ అనే నటిని ప్రస్తావిస్తూ సాగిన విషయం తెలిసిందే. దీంతో ఇది బాగా వైరల్ అయింది. ఇక ఇది చూసిన చాలామంది ఈ మోనికా బెలూచీ ఎవరు? ఆమె ఎక్కడుంటుంది? ఏం చేస్తుంది? అని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఈ మోనికా బెలూచీ (Monica Bellucci) ఎవరో? ఇప్పుడు చూద్దాం.
మోనికా సాంగ్తో ట్రెండ్ సెట్ చేసిన పూజా హెగ్డే..
ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రజనీకాంత్ (Rajinikanth)హీరోగా నటిస్తున్న చిత్రం కూలీ (Coolie). ఆగస్టు 14వ తేదీన తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. తమిళ్ ఇండస్ట్రీ నుండి పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున (Nagarjuna ), బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) తో పాటు శాండిల్ వుడ్ స్టార్ హీరో ఉపేంద్ర (Upendra) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ (Shruti Haasan) హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమా నుండి విడుదలైన పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందులో ఈ మోనికా సాంగ్ కూడా ఒకటి. ఈ పాటలో అటు పూజా హెగ్డే (Pooja Hegde) తో పాటు సౌబిన్ షాహీర్(Soubin shahir) కూడా తమ అద్భుతమైన పర్ఫామెన్స్ తో అదరగొట్టేశారు.
ఎవరీ మోనికా బెలూచీ?
ఇక ఇందులో వచ్చిన “మోనికా బెలూచీ” ఎవరో కాదు ఈమె ఒక ఫేమస్ ఇటాలియన్ నటి. ఇటలీ దేశంలో 1964 సెప్టెంబర్ 30న జన్మించారు. ఈమె తండ్రి ట్రక్ కంపెనీని నడిపేవారు. తల్లి గృహిణి. మోనికా న్యాయవాది అవ్వాలి అని కెరియర్ మొదలుపెట్టిందట. కానీ అనూహ్యంగా మోడల్ రంగంలోకి అడుగు పెట్టింది. అందులో వచ్చిన డబ్బును తన చదువుకి ఉపయోగించుకుంది. మళ్లీ మెల్లిగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలా ఇటాలియన్ సినిమాలతో పాటు ఫ్రెంచ్, అమెరికన్ సినిమాలలో కూడా ఈమె నటించింది. ముఖ్యంగా మాలెనా , ఇర్ రివర్సిబుల్ , ది ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్, ది మ్యాట్రిక్స్ వంటి చిత్రాలలో ఈమె పోషించిన పాత్రలకు మరింత గుర్తింపు లభించింది.
ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళగా గుర్తింపు..
50 ఏళ్ల వయసులో కూడా జేమ్స్ బాండ్ సినిమాలో నటించి అతిపెద్ద వయసు గల బాండ్ గర్ల్ గా చరిత్ర సృష్టించిన ఈమె ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళలలో ఒకరిగా స్థానం సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం ఈమె గురించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే కూలీ సినిమా ఆగస్టు 14న విడుదల కాబోతుండగా.. ఈ చిత్రానికి పోటీగా ఎన్టీఆర్(NTR ), హృతిక్ రోషన్ (Hrithik Roshan) కలయికలో వస్తున్న వార్ 2 (War 2) సినిమా కూడా విడుదల కాబోతోంది.
ALSO READ: War 2: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బ్రేక్!