Guvvala vs Ktr: అంతర్గత సమస్యలు బీఆర్ఎస్‌ని వెంటాడుతున్నాయా? చెల్లికి రాఖీ కట్టకుండా కేటీఆర్ ఎందుకు దూరంగా ఉన్నారు? కారు దిగుతున్న నేతలు ఎందుకు కేటీఆర్‌పై రుసరుసలాడుతున్నారు? వారు అవలంభించిన విధానాలే అందుకు కారణమా? మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అలాంటి మాటలు ఎందుకన్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
ప్రస్తుతం రాజకీయాల్లో ట్రెండ్ మారింది. ఎప్పుడు.. ఎవరు.. ఏ పార్టీ వైపు ఉంటారో తెలియదు. అందుకే చాలామంది నేతలు సైలెంట్‌గా ఉంటున్నారు. కేవలం కీలక నేతలు మాత్రమే మాట్లాడుతున్నారు. జాతీయ పార్టీలు తప్పితే ప్రాంతీయ పార్టీల్లో ఈ ఒరవడి కంటిన్యూ అవుతోంది. అలాగని రాజకీయాల్లో శాశ్వత శత్రవులు, శాశ్వత మిత్రులు ఉండరు. అందుకు ఉదాహరణ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.
బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. రేపో మాపో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. అందుకు సంబంధించి తెరవెనుక జరగాల్సిన పనులు జరుగుతున్నాయి. కేవలం జాతీయ రాజకీయాల గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో బీజేపీలోకి వెళ్తున్నట్లు గువ్వల మొదట్లో చెప్పారు. కానీ మాటల్లో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా బిగ్ టీవీ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు గువ్వల బాలరాజు. ఒకవిధంగా చెప్పాలంటే బీఆర్ఎస్ కీలక నేతలపై అసహనాన్ని బయటపెట్టారు. ఈ క్రమంలో కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకంటే కేటీఆర్ పెద్దోడేమీ కాదని తేల్చేశారు.
ALSO READ: సాయంత్రం అయితే చాలు ఒకటే కుమ్ముడు.. తడిచి ముద్దైన భాగ్యనగరం
బలమైన సామాజిక వర్గం నుంచి రావచ్చు.. ఎక్కువగా విదేశాల్లో చదువుకుని ఉండొచ్చు. కానీ తనకుంటే ఎక్కువ నైపుణ్యాలు ఉండవచ్చు కానీ, తనకంటే పెయిన్, ఆకలి మంటలు ఆయన చూడలేదన్నారు. నాకున్న అనుభవం ఆయనకు ఉందని తాను భావించడం లేదన్నారు.
కేటీఆర్ మాదిరిగా ఆకట్టుకునే ప్రసంగాలు తాను చేయలేకపోవచ్చు.. ఆకలి కేకలు వినిపించడం మొదలుపెడితే గ్రామాల్లో ఆయన అడుగుపెట్టనీయనని తేల్చేశారు. ఈ విషయాన్ని బిగ్ టీవీ ద్వారా కేటీఆర్‌కు చెబుతున్నానని హెచ్చరించారు. తాను మాట్లాడే మాట ఆయన దగ్గరకు వెళ్లాలన్నారు. ఇదేం పద్దతి అంటూ రుసరుసలాడారు.
గువ్వల పార్టీకి రాజీనామా తర్వాత కేటీఆర్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో గువ్వల రియాక్ట్ అయినట్టు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ వ్యవహారశైలిపై కవిత కొన్ని విషయాలు బయటపెడుతున్నారని, అలాంటిది గువ్వల చెప్పడంలో తప్పేమీ లేదంటున్నారు.
ఇప్పటికే కేటీఆర్-కవిత మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. స్వయానా చెల్లికి రాఖీ కట్టకుండా దుబాయ్ చెక్కేశారని అంటున్నారు. ఆధిపత్య పోరు కారణంగా ఈ విధంగా జరగుతుందని అంటున్నారు బీఆర్ఎస్‌లోని ఓ వర్గం. గువ్వల నోటి నుంచి రాబోయే రోజుల్లో ఇంకెన్ని కొత్త విషయాలు బయటకు వస్తాయో చూడాలి.
కేటీఆర్ పై గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు..
కేటీఆర్ నాకంటే పెద్దోడేమీ కాదు: బాలరాజు
విదేశాల్లో చదువుకుని ఉండొచ్చు కానీ.. నాకు ఉన్న అనుభవం కేటీఆర్ కు లేదని నేను భావిస్తున్నా
ఆకలి కేకలను వినిపించడం మొదలుపెడితే గ్రామాల్లో కేటీఆర్ ను అడుగుపెట్టనివ్వను
– బాలరాజు pic.twitter.com/KhuF7VgNyw
— BIG TV Breaking News (@bigtvtelugu) August 10, 2025