MacBook Air M3 : యాపిల్ కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన MacBook Air M3 తక్కువ ధరకే కొనే అవకాశం ఉంది. ప్రస్తుతం దీని ధర రూ.1,10,000 కంటే ఎక్కువగా ఉండగా ఆఫర్ లో అతి తక్కువ ధరకే కొనే అవకాశం ఉంది.
యాపిల్ నుంచి త్వరలోనే MacBook Air M4 లాంఛ్ కాబోతుంది. అయితే ఇంతకు ముందు లాంఛ్ అయిన Apple MacBook Air M3 ధర అన్ని ఈ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో రూ.1,50,000గా ఉంది. ప్రస్తుతం ఆఫర్ లో ఈ ల్యాప్ టాప్ ను రూ.95వేలకే సొంతం చేసుకోవచ్చు.
సిస్టమ్ అప్డేట్ చేయాలనుకునే యూజర్స్ కు ఇదే బెస్ట్ ఆప్షన్. నిజానికి M3 MacBook Air 16GB వరకు RAMకు సపోర్ట్ చేస్తూ దాని ముందు వెర్షన్స్ కంటే స్పీడ్ గా పని చేస్తుంది. ఈ ఆఫర్స్ లో M2 MacBook Air గణనీయమైన తగ్గింపుతో అందుబాటులో ఉంది.
MacBook Air M3 ధర, ఆఫర్స్ –
M3 MacBook Air ధర సాధారణంగా రూ. 1,10,000 కంటే ఎక్కువగా ఉంది. MacBook Air M3 ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో రూ. 94,499గా ఉండగా… ICICI, Kotak లేదా SBI క్రెడిట్ కార్డ్‌ల నుండి ఎంపిక చేసిన కార్డ్‌లను ఉపయోగించడంపై కస్టమర్‌లు రూ. 5,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్‌లను పొందవచ్చు. HDFC బ్యాంక్ కార్డ్ వినియోగదారులు రూ. 4,000 తగ్గింపును పొందవచ్చు. ఇక ఈ డీల్స్ అన్నీ 8GB+256GB వేరియంట్ కోసం మాత్రమే. ఇక వినియోగదారులు తమ బ్యాంక్ నిబంధనలను బట్టి నో-కాస్ట్ EMI ఎంపికలను కూడా పొందవచ్చు.
విజయ్ సేల్స్ కాకపోతే, M3 మ్యాక్‌బుక్ ఎయిర్ రిలయన్స్ డిజిటల్‌లో కూడా రూ. 98,606 ధరకు అందుబాటులో ఉంది. ఖాతాదారులు బ్యాంకులు, చెల్లింపు ఎంపికలను బట్టి నో-కాస్ట్ EMI ఎంపికను పొందవచ్చు.
M3 MacBook Air స్పెసిఫికేషన్‌లు –
మ్యాక్‌బుక్ ఎయిర్ 13.6-అంగుళాల 15.3 అంగుళాల లిక్విడ్ రెటినా IPS డిస్‌ప్లేతో వచ్చేసింది. ఇక రెండు డిస్‌ప్లే సైజుల్లో 500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇది 8 కోర్ CPU, 10 కోర్ GPUతో వస్తుంది. గరిష్టంగా 24GB మెమరీకి మద్దతు ఇవ్వగలదు. Apple తెలిపిన వివరాల ప్రకారం, M3 మ్యాక్‌బుక్ ఎయిర్ M1 పవర్డ్ మ్యాక్‌బుక్ ఎయిర్ కంటే 60 శాతం స్పీడ్ గా పనిచేస్తుంది.
ఫీచర్స్ – ఇది రియల్ టైమ్ స్పీచ్ టు టెక్స్ట్, ట్రాన్స్లేషన్, విజువల్ మెుమోరీ, టెక్స్ట్ ప్రిడిక్షన్‌లు, యాక్సెసిబిలిటీ ఫీచర్ లతో వచ్చేసింది. M3 మ్యాక్‌బుక్ ఎయిర్ బ్యాకప్‌ను తిరిగి పొందడానికి గరిష్టంగా 18 గంటలు MagSafe ఛార్జింగ్‌తో వస్తుంది.
ఇది Wi-Fi 6E, బ్లూటూత్ 5.3 చిప్‌సెట్, రెండు థండర్‌బోల్ట్ పోర్ట్‌లు, హెడ్‌ఫోన్ జాక్‌తో పాటు TouchID, 1080p ఫేస్‌టైమ్ HD కెమెరాతో వచ్చేసింది. ఇది స్పేషియల్ ఆడియో, డాల్బీ అట్మోస్ స్పీకర్ సిస్టమ్ తో వచ్చేసింది. ఇక ఇంకెందుకు ఆలస్యం తక్కువ ధరకే యాపిల్ ల్యాప్ టాప్ కొనాలనుకుంటే మీరూ ట్రై చేసేయండి.
ALSO READ : మారిపోనున్న వాట్సాప్ వీడియో కాల్స్ తీరు.. అదిరే ఎఫెక్ట్స్ ఇంకా వావ్ అనిపించే ఫీచర్స్