BigTV English

Trisha: అక్కడ సర్జరీ చేయించుకోబోతున్న హిరోయిన్ త్రిష..?

Trisha: అక్కడ సర్జరీ చేయించుకోబోతున్న హిరోయిన్ త్రిష..?

Trisha:సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలకు పైగానే అవుతున్నా.. ఇప్పటికీ అదే అందంతో వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఒకప్పుడు సీనియర్ హీరోలతో వరుస పెట్టి సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మళ్లీ అదే హీరోలతో జత కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా సరే హీరోయిన్స్ కి లైఫ్ టైం చాలా తక్కువ. ఒకసారి హీరోయిన్గా కెరియర్ డౌన్ అయింది అంటే మళ్ళీ వాళ్లకు హీరోయిన్గా అవకాశాలు రావడం చాలా అరుదు. అలాంటి వారిలో నయనతార (Nayanthara ), త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. త్రిష ఒకప్పుడు ప్రభాస్(Prabhas), చిరంజీవి(Chiranjeevi ), మహేష్ బాబు (Maheshbabu), వెంకటేష్ (Venkatesh) వంటి స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు మళ్లీ ఇప్పుడు అదే స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది అంటే ఇండస్ట్రీలో ఈమెకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.


రీ ఎంట్రీలో కూడా జోరుగా దూసుకుపోతున్న త్రిష..

మణిరత్నం (Maniratnam) దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియన్ సెల్వన్ 1&2’ చిత్రాలతో రీఎంట్రీ ఇచ్చి భారీ సక్సెస్ అందుకున్న ఈమె , ఆ తర్వాత ‘లియో’ చిత్రంలో నటించింది. ఫిబ్రవరి 6న రీసెంట్గా విడుదలైన అజిత్ (Ajith) ‘విడాముయర్చి’ సినిమాలో కూడా నటించింది. అంతేకాదు ఇప్పుడు చిరంజీవి హీరోగా వశిష్ట మల్లిడి దర్శకత్వంలో వస్తున్న ‘విశ్వంభర’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇలా వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న త్రిష కు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


సర్జరీకి సిద్ధమైన త్రిష..

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. 40 ఏళ్ల వయసులో ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఒక సర్జరీ చేయించుకోవడానికి సిద్ధమైందట. అదేంటో ఇప్పుడు చూద్దాం. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్, హీరోలు సర్జరీ చేయించుకోవడం ఇదేమి కొత్త కాదు. ఇప్పటికే బడా స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార, సమంత, శృతిహాసన్, ఎమీ జాక్సన్ వంటి ఎంతోమంది లిప్ సర్జరీ చేయించుకున్న వారే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాలో చాలామంది వచ్చి చేరుతారు. ఇప్పుడు త్రిష కూడా తన లిప్స్ భాగానికి సర్జరీ చేయించుకోబోతోందట. అయితే ఈ విషయం తెలిసి సోషల్ మీడియాలో ఆమెపై కొంతమంది ట్రోల్స్ గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ఆమె పెదాలపై వల్గర్ కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో.. త్రిష ఆ నెగెటివ్ కామెంట్స్ నుండి తప్పించుకోవడానికి సర్జరీకి సిద్ధమవుతోందని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ త్రిష కు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే కోలీవుడ్ లో ఈ వార్త బాగా వైరల్ అవడంతో ఆమె అభిమానులు ఒక్కోరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. “మీరు ఎవర్ గ్రీన్ యాక్టర్.. అలాంటి సర్జరీలు వద్దు” అని కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. మరికొంతమంది “ఆమె లైఫ్ ఆమె ఇష్టం.. మధ్యలో ట్రోల్స్ చేయడానికి మనం ఎవరం” అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏదిఏమైనా త్రిష తన పెదాలకు సర్జరీ చేయించుకోబోతోంది అంటూ వస్తున్న వార్తలలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×