BigTV English

BRICS INDIA CHINA: ‘బ్రిక్స్ ఒక కలగానే మిగిలిపోతుంది’.. ఇండియా, చైనా సంబంధాలే కీలకం..

BRICS INDIA CHINA: ‘బ్రిక్స్ ఒక కలగానే మిగిలిపోతుంది’.. ఇండియా, చైనా సంబంధాలే కీలకం..

BRICS INDIA CHINA| ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా శక్తికి మూల కారణాలు రెండు. ఒకటి దాని అడ్వాన్స్‌డ్ ఆయుధాలు, రెండోది అమెరికా డాలర్. ఈ రెండింటిలో ఆయుధాల విషయంలో ఇతర దేశాలు కూడా క్రమంగా అడ్వాన్స్ అవుతున్నాయి. అయితే అమెరికన్ డాలర్ ఒక మామూలు శక్తి కాదు. అది అంతర్జాతీయ కరెన్సీ. ప్రపంచలోని అన్ని దేశాలు ఇతర దేశాలతో వ్యాపారం కోసం అమెరికన్ డాలర్ ద్వారానే వాణిజ్యం సాగిస్తాయి. కానీ తన డాలర్ శక్తిని స్వలాభం కోసం, ఇతర దేశాలను అణదొక్కడం కోసం ఉపయోగిస్తోందనడంలో సందేహం లేదు.


దీంతో అమెరికన్ డాలర్ కు ప్రత్యామ్నాయ శక్తిగా మరో అంతర్జాతీయ కరెన్సీ తీసుకురావాలని 2001లో ప్రముఖ గోల్డ్ మాన్ శాక్స్ అంతర్జాతీయ ఫైనాన్స్ సంస్థకు చెందిన ఆర్థిక మేధావి జిమ్ ఓ నీల్ అభిప్రాయపడ్డారు. ఆ ప్రత్యామ్న శక్తిని రూపొందించడంలో రష్యా, చైనా, ఇండియా, బ్రెజిల్ లాంటి దేశాలు కలిసి పనిచేస్తేనే సాధ్యమవుతుందని ఆయన అంచనా వేశారు. ఆయనే బ్రిక్ (బ్రెజిల్, రష్య, ఇండియా, చైనా) పదానికి రూపకర్త. కాలక్రమంలో ఈ ఐడియా నిజం అయింది. రష్య, చైనా దేశాలు కలిసి బ్రెజిల్, ఇండియాతో జత కట్టాయి. దీంతో మిస్టర్ బ్రిక్స్ గా ఆర్థికవేత్త జిమ్ ఓ నీల్ ఫేమస్ అయ్యారు.

Also Read: మేడ్ ఇన్ ఇండియా తుపాకులు అమెరికాకు ఎగుమతి.. ఉత్తర్ ప్రదేశ్ లో తయారీ


అయితే అమెరికా డాలర్ కు పోటీగా మరో అంతర్జాతీయ కరెన్సీ తీసుకురావాలంటే బ్రిక్స్ దేశాల మధ్య ఎంతో సహకారం ఉండాలి. కానీ బ్రిక్స్ దేశాలలో ఇండియా, చైనా మధ్య విభేదాలు ఉన్నంతవరకు బ్రిక్స్ విజయవంతం కావడం ఒక కలగానే మిగిలిపోతుంది అని జిమ్ ఓ నీల్ తాజాగా వ్యాఖ్యలు చేశారు.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాను ఏకాకి చేయాలని అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్న తరుణంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం బ్రిక్స్ దేశాల ఐక్యతతో వారికి సమాధానం చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. ఆసియా దేశాల ఐక్యతతో పశ్చిమ దేశాలకు చెక్ పెట్టే ప్లాన్ లో పుతిన్ ఉన్నారు. అందుకే అమెరికా డాలర్ పవర్ ను నియంత్రించడానికి బ్రిక్స్ బలంగా పుంజుకోవాలి. అందుకోసం ముఖ్యంగా ఇండియా, చైనా కలిసి పనిచేయాలి. అది పూర్తి స్థాయిలో జరగడంలేదని మిస్టర్ బ్రిక్స్ జిమ్ ఓ నీల్ అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ తో అన్నారు.

“బ్రిక్స్ దేశాలు అంతర్జాతీయ ఎకానమీ హబ్ గా మారే అవకాశాలు నిజంగా ఉన్నాయి. కానీ జి7 దేశాల లాగా బ్రిక్స్ కూడా ఒక కలలాగే మిగిలిపోతుందేమో. ఇప్పటివరకైతే బిక్ర్స్ దేశాలలో రష్య, చైనా మాత్రమే అమెరికన్ డాలర్ కు వ్యతిరేకంగా గట్టిగా శ్రమిస్తున్నాయి. కానీ ఇండియా, చైనా మధ్య సమస్యలు బ్రిక్స్ ఉద్దేశాలకు అవరోధంగా మారాయి. ప్రపంచ సమస్యలు పరిష్కరించడానికి అమెరికా, యూరోపియన్ దేశాలు కలిసి పనిచేస్తున్నా.. వారు ఇండియా, చైనా సహకారం లేనిదే అవి సాధించేలేరో.. బ్రిక్స్ గ్రూపులో కూడా అంతే ఈ రెండు దేశాలే కీలకం. ఇరు దేశాలు పూర్తి సహకారంతో పనిచేయాలి. పేరుకు మాత్రమే ప్రతీ సంవత్సరం బ్రిక్స్ సమావేశాలు నిర్వహిస్తే సరిపోదు. ” అని జిమ్ ఓ నీల్ వ్యాఖ్యానించారు.

బ్రిక్ దేశాల సమూహంలో ఇప్పటివరకు అదనంగా సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు చేరాయి. దీంతో ఈ సమూహం పేరు బ్రిక్ నుంచి బ్రిక్స్ గా మారింది. ఇంకా సౌదీ అరేబియా ఈ గ్రూపులో చేరేందుకు అవకాశం ఉంది.

అయితే బ్రిక్స్ విజయం కోసం చైనా, ఇండియా తమ మధ్య ఉన్న సరిహద్దు సమస్యకు తాత్కాలిక పరిష్కారంగా ఇరువైపులా బార్డర్ పాట్రోలింగ్ కు అంగీకరించాయి. బ్రిక్స్ దేశాల జనభా ప్రపంచ జనాభాలో 45 శాతం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల ఎకానమీ వాటా 35 శాతం. ఈ మొత్తంలో 50 శాతానికి పైగా చైనా ఎకానమీదే కావడం గమనార్హం.

తాజాగా బుధవారం జరిగిన బ్రిక్స్ సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ.. కొత్తగా 30కు పైగా దేశాలు బ్రిక్స్ సమూహంలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నాయని తెలిపారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×