BigTV English

Tweet War between Sai Dharam Tej and YCP Fans: సాయిధరమ్ తేజ్ ని టార్గెట్ చేసిన వైసీపీ నేతలు.. ఎందుకో తెలుసా?

Tweet War between Sai Dharam Tej and YCP Fans: సాయిధరమ్ తేజ్ ని టార్గెట్ చేసిన వైసీపీ నేతలు.. ఎందుకో తెలుసా?

Tweet War between Sai Dharam Tej and YCP Fans about anna canteen plates cleaning: మెగా ఫ్యామిలీనుంచి వచ్చి తనకంటూ ఓ క్రేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు సాయి ధరమ్ తేజ్. అయితే ఈ మెగా హీరో గత ఎన్నికలలో టీడీపీ కూటమికి మద్దతునిస్తూ తన మావయ్య పవన్ కళ్యాణ్ ను సపోర్ట్ చేస్తూ మెగా బ్రదర్స్ నాగబాబు, పవన్ వెంట నడిచారు. అయితే ఇటీవల సాయిధరమ్ తేజ్ వైసీపీ నేతల మధ్య ట్విట్టర్ లో వార్ నడుస్తోంది. వైసీపీ నేతలు సాయిధరమ్ ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే ఓ ఎన్ఆర్ఐ వైసీపీ వీరాభిమాని ట్విట్టర్ అకౌంట్ లో బాగా యాక్టివ్ గా ఉంటారు. టీడీపీ కూటమి ప్రభుత్వం మొన్న ఆగస్టు 15 నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్న క్యాంటీన్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దానితో సదరు ఎన్ఆర్ఐ వైసీపీ నేత చింతా ప్రదీప్ రెడ్డి అన్న క్యాంటీన్లపై తన అక్కసును వెళ్లబుచ్చాడు.


మెడలు రుద్దే సేఫ్ హ్యాండ్స్

తణుకు ప్రాంతంలో ఒక చోట అన్న క్యాంటీన్లలో ప్లేట్లను, గ్లాసులను మురికి నీటితో శుభ్రం చేయడం చూసి ఇలా కామెంట్ చేశారు. మెడలు రుద్దే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ సాయి ధరమ్ తేజ్..వెళ్లి తణుకులో అన్న క్యాంటీన్ ప్లేట్లు, గ్లాసులు కడగొచ్చు కదా నీ సేఫ్ హ్యాండ్స్ తో అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు ప్రదీప్ రెడ్డి. వెంటనే సాయిధరమ్ తేజ్ ప్రదీప్ రెడ్డి ట్వీట్ కు ఎలాంటి సంబంధం లేకుండా స్టేట్ మెంట్ ఇస్తూ ఓ ట్వీట్ తో ఎదురుదాడి చేశాడు.ఎగ్ పఫ్ లకు బిల్లు ఎక్కువైనట్లు ఉంది. మీరు బాగా తినేసి ఉంటారు అని అంటూ ట్వీట్ చేశాడు. అందుకు ప్రతిగా చింతా ప్రదీప్ రెడ్డి తాను తన ఇష్టం మేరకు ఎగ్ పఫ్ లు కొనుక్కుని తింటానని అందుకు ఎవరి సహాయం అక్కర్లేదని ఒకరి సాయం తనకు అవసరం లేదని సాయి ధరమ్ తేజ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అయితే సాయి ధరమ్ తేజ్ ను ఏపీలో కొందరు వైసీపీ నాయకులు టార్గెట్ చేశారు. అసలు ప్రదీప్ రెడ్డి అడిగింది ఏమిటి? నువ్వు చెప్పిందేమిటి? మధ్యలో ఈ ఎగ్ పఫ్ లు ఎందుకొచ్చాయని ప్రశ్నించారు.


సామాజిక బాధ్యత లేదా?

మురికి నీళ్లతో ప్లేట్లు, గ్లాసులు కడగడమేమిటని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా టాపిక్ ను డైవర్ట్ చేయడం పై సాయిధరమ్ ను నిలదీస్తున్నారు. ఆయన ఒకవేళ ఎగ్ పఫ్ లు అన్నేసి తిన్నట్లయితే అందుకుతగిన బిల్లులు చూపించాలని అన్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక జరుగుతున్న హింసాత్మక ఘటనలు, అత్యాచారాలపై స్పందించని సాయిధరమ్ తేజ్ కు సామాజిక బాధ్యత లేదా అని ప్రశ్నిస్తున్నారు. సిల్లీ విషయాలపై కాదు రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక సంఘటనలపై స్పందించాలని వైసీపీ నేతలు సాయిధరమ్ తేజ్ ని టార్గెట్ చేశారు. ప్రస్తుతం ఈ ఎగ్ పఫ్ ల టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×