BigTV English

Jayam Ravi – Arthi : జయం రవి – ఆర్తి విడాకుల కేసులో ట్విస్ట్.. వెనక్కి తగ్గిన భార్య..

Jayam Ravi – Arthi : జయం రవి – ఆర్తి విడాకుల కేసులో ట్విస్ట్.. వెనక్కి తగ్గిన భార్య..

Jayam Ravi – Arthi : తమిళ స్టార్ హీరో జయం రవి, ఆయన భార్యతో విడాకులు తీసుకుపోతున్నాడు అంటూ గత కొద్ది రోజులుగా కోలీవుడ్ ఇండస్ట్రీని ఓ వార్త షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నానంటూ సోషల్ మీడియా ద్వారా హీరో జయం రవి ప్రకటించారు. ఈ వార్తను విన్న ఆయన భార్య ఆర్తి వ్యతిరేకిస్తూ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్ట్లు పెడుతూ వస్తుంది. రీసెంట్ గా వీరిద్దరూ చెన్నై ఫ్యామిలీ కోర్టుకు వెళ్లారు.. అక్కడ వీరి కేసును విచారించిన న్యాయవాదులు కేసును వచ్చే నెల 12 కి వాయిదా వేశారు. అయితే జయం రవి భార్య ఆర్తి 40 లక్షలు నెలకు భరణం ఇవ్వాలని కోరింది. దీనిపై జూన్ 12న క్లారిటీ రానుంది. ఇదిలా ఉండగా ఇప్పటివరకు జయం రవికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన ఆర్తి.. ఆ పోస్టులను డిలీట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.. ఆమె ఎందుకు డిలీట్ చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..


సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దని వార్నింగ్.. 

కోలీవుడ్ హీరో జయం రవి, ఆర్తి విడాకుల వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా వీరిద్దరి గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. తనను వేధింపులకు గురి చేశారంటూ జయం రవి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆ తర్వాత ఆయన భార్య ఆర్తి సైతం మూడో వ్యక్తి ప్రమేయం వల్లే విడాకులకు దారితీసిందని ఆరోపించింది. విడాకుల విషయంలో ఇప్పటికే వీరిద్దరు కోర్టుకు కూడా హాజరవుతున్నారు.. అయితే వీరిద్దరు విడాకులు మాత్రమే ఒక కొలిక్కిరాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం రకరకాల వార్తలయితే వినిపిస్తున్నాయి.. అఫీషియల్ గా విడాకులు అయితే రాలేదు కాబట్టి జయం రవి తన గురించి ఎటువంటి పోస్టులు పెట్టద్దని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇదే ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో హైలెట్ టాపిక్ అవుతుంది.


పోస్టులను డిలీట్ చేసిన ఆర్తి.. 

జయం రవి, ఆర్తి ఇద్దరు ఒకరిపై మరొకరు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతూ వస్తున్నారు. అయితే ఇది కేవలం పరువు నష్టం చేసేదానికే అన్నట్లుగా కోర్టు వార్నింగ్ ఇవ్వడంతో ఆర్తి గత కొన్ని రోజులుగా తను పెట్టిన పోస్టులు అన్నిటిని డిలీట్ చేస్తూ వస్తుంది. దంపతులు ఒకరిపై ఒకరు పరువు నష్టం కలిగించే పోస్టులను పెట్టవద్దని హైకోర్టు ఆదేశించండంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రవి తన భార్య ఆర్తితో పాటు అత్త సుజాతకు నోటీసులు పంపారు. తమ విభేదాల గురించి మాట్లాడటం మానేయాలని వారిద్దరికీ లీగల్ నోటీసు పంపారు.. అటు ఆర్తి కూడా జయం రవికి లీగల్ నోటీసులు పంపించింది. జయం రవి, ఆర్తి 16 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు ఆరవ్, అయాన్‌ ఉన్నారు.. మరి జూన్ 12న వీరిద్దరి విడాకులు పై హైకోర్టు ఎలాంటి తీర్పును ఇస్తుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×