BigTV English

Diamond Mining: మన స్వర్ణాంధ్రలో భారీగా వజ్రాలు.. దొరికితే కోటీశ్వరులే.. ఎక్కడో తెల్సా?

Diamond Mining: మన స్వర్ణాంధ్రలో భారీగా వజ్రాలు.. దొరికితే కోటీశ్వరులే.. ఎక్కడో తెల్సా?

Diamond Mining: ప్రపంచంలో వజ్రాలకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చూడడానికి చిన్న సైజులో ఉండే వజ్రాలు కోట్లు పలుకుతాయి. అదృష్టం కొద్ది మనకు వజ్రం కనిపిస్తే.. మనల్ని లక్ష్మీదేవి వరించినట్లే. విదేశాల్లో వజ్రాలకు వందల కోట్ల డిమాండ్ ఉంది. అయితే విలువైన వజ్రాలు మన భారతదేశంలో కూడా దొరుకుతాయి. ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వజ్రాలు పుష్కలంగా దొరికేవట. ఒకప్పుడు భారతదేశం వజ్రాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండేది. కోహీనూర్, హోప్ డైమండ్ లాంటి ప్రపంచ ప్రసిద్ధ వజ్రాలకు మన దేశం జన్మస్థలం.


కతుబ్ షాహీ కాలంలో కూడా తెలంగాణలో వజ్రాల వ్యాపారం జోరుగా కొనసాగేది. ఈ వజ్రాలు  రాజ వంశాలకు, సామ్రాజ్యాలకు ఎంతో గర్వకారణంగా ఉండేవి. ప్రపంచ వ్యాప్తంగా వజ్రాలు దొరికినా.. మన దేశంలో ఉత్పత్తి అయ్యే వజ్రాలకు చాలా డిమాండ్ ఎక్కువ. విదేశీయులు భారతదేశ వజ్రాలపైన ఎక్కువగా ప్రేమ చూపేవారు. అంటే మన దేశ వజ్రాలు అంత క్వాలిటీగా ఉండేవి. 17, 18వ శతాబ్ధంలో వివాహాలు, పండుగలు, పెట్టుబడి అవకాశాల కోసం వజ్రాలు ఎల్లప్పుడూ కేంద్ర బిందువుగా ఉన్నాయి.

ALSO READ: India Gold Mining: ఈ ప్రాంతాల్లో తళతళ మెరిసే బంగారు గనులు.. రూ.లక్షల కోట్ల విలువైన సంపద


భారతదేశంలో ప్రధానంగా వజ్రాల గనులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పన్నా గనులు వజ్రాలకు ఎంతో ప్రసిద్ధి చెందినవి. పన్నా గనులను వజ్రాల నగరంగా కూడా పిలుస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో కూడా వజ్రాలు ఉన్నట్టు పరిశోదనల్లో తేలింది. ఒడిశాలో మహానది పరీవాహక ప్రాంతాల్లో వజ్రాల గనులు ఉన్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలోని వైరాఘర్ కాంగ్లోమెరేట్స్ లో కూడా వజ్రాల గనులు ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం దేశంలోనే అతిపెద్ద వజ్రాల గని మధ్యప్రదేశ్ లోని ఛతర్ పుర్‌లో గుర్తించారు. అక్కడి అటవీ ప్రాంతంలో దాదాపు 62 ఎకరాల్లో 3.42 కోట్ల వజ్రాలు ఉన్నట్లు గతంలోనే అధికారులు అంచనా వేశారు.

ALSO READ: Gold Mining: మన తెలుగు రాష్ట్రాల్లో బంగారు గనులు.. రూ.లక్షల కోట్ల నిల్వలు గుర్తింపు

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. అనంతపురం, కర్నూలు జిల్లాలో అప్పడప్పుడు వజ్రాలు కనిపిస్తున్నాయి. ఆ జిల్లాల్లో వర్షం పడితే చాలు నేలను చీల్చుకుంటూ వజ్రాలు బయటకు ఉప్పొంగి వస్తున్నాయి. జొన్నగిరి, తుగ్గిలి లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా బంగారం, వజ్రాలు కనిపిస్తున్నాయి. దీంతో అక్కడ స్థానిక ప్రజలు వజ్రాల కోసం వేటాడుతున్నారు. అక్కడ పొలాల్లో, చెరువుల దగ్గర వజ్రాల కోసం వెతుకుతున్నారు. కానం కొంత మందికి మాత్రమే అదృష్టం వరిస్తుంది. ఇక వజ్రం దొరికిన వారు మాత్రం కోటీశ్వరులే.

ఈ క్రమంలోనే అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వజ్రాల కోసం అక్కడి ప్రజలు అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఒక్క వజ్రం దొరికినా కష్టాలన్నీ తొలిగిపోతాయని వజ్రాల కోసం రాత్రి పగళ్లు కష్టపడే వాళ్లు చాలా మంది ఉన్నారు. గతంలో కూడా అక్కడ ఓ గొర్రెల కాపరికి, ఇద్దరు వ్యవసాయ కూలీలకు వజ్రాలు దొరికాయి. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలో తొలకరి వర్షాల సమయంలో వజ్రాలు నేల నుంచి బయటకొస్తాయి. దీంతో ప్రతి ఏటా ఇక్కడ వజ్రాల కోసం స్థానికులు అన్వేషన సాగిస్తారు. మామూలుగా తొలకరి వర్షం ప్రారంభం కాగానే ఈ అన్వేషణ మొదలవుతుంది . ఒక్క వజ్రం దొరికినా చాలు జాతకం మారిపోతుందని అక్కడి ప్రజలు వెతుకుతుంటారు.

Related News

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

BSNL Rs 1 Plan: వావ్ సూపర్.. రూ.1కే 30 రోజుల డేటా, కాల్స్.. BSNL ‘ఫ్రీడమ్ ఆఫర్’

Wholesale vs Retail: హోల్‌సేల్ vs రిటైల్ మార్కెట్.. ఏది బెటర్? ఎక్కడ కొనాలి?

Salary Hike: అటు ఉద్యోగుల తొలగింపు, ఇటు జీతాల పెంపు.. TCSతో మామూలుగా ఉండదు

Gold Rate: వామ్మో.. దడ పుట్టిస్తున్న బంగారం ధరలు.. రికార్డ్ బ్రేక్.

D-Mart: డి-మార్ట్ లోనే కాదు, ఈ స్టోర్లలోనూ చీప్ గా సరుకులు కొనుగోలు చెయ్యొచ్చు!

Big Stories

×