E-Paper
Advertisement

Unstoppable with NBKS2: అన్‌స్టాప‌బుల్‌పై కోర్టుకెక్కిన ఆహా.. ఢిల్లీ హైకోర్టు ఆర్డ‌ర్స్‌

Unstoppable with NBKS2: అన్‌స్టాప‌బుల్‌పై కోర్టుకెక్కిన ఆహా.. ఢిల్లీ హైకోర్టు ఆర్డ‌ర్స్‌
Advertisement

Unstoppable with NBKS2:తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’లో ప్ర‌సారం అవుతున్న టాక్ షో అన్‌స్టాప‌బుల్‌. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇండియాలోనే ఈ టాక్ షో నెంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో దూసుకెళ్తోంది. నంద‌మూరి బాల‌కృష్ణ ఈ టాక్ షోను హోస్ట్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ టాక్‌షోకి సంబంధించి రెండు క్రేజియ‌స్ట్ ఎపిసోడ్స్ త్వ‌ర‌లోనే ప్రీమియ‌ర్ కానున్నాయి. అయితే కొన్ని యూ ట్యూబ్స్, సామాజిక మాధ్య‌మాల ద్వారా టాక్ షో, ప్రోమోల‌ను అన‌ధికారికంగా ప్ర‌సారం చేస్తున్నారు. దీనిపై ఆహా యాజ‌మాన్యం కోర్టు త‌లుపుల‌ను త‌ట్టింది. విచార‌ణ చేప‌ట్టిన కోర్టు కీల‌క ఆదేశాల‌ను జారీ చేసింది.

సోష‌ల్ మీడియాలో ప్ర‌సారం అవుతున్న అన‌ధికారిక లింక్స్ వ‌ల్ల త‌మ‌కు న‌ష్టం వాటిల్లుతుంద‌ని కాబ‌ట్టి అన‌ధికారికంగా అన్‌స్టాప‌బుల్ షోస్‌ను ప్ర‌సారం చేస్తున్న సోష‌ల్ మీడియా మాధ్య‌మాలపై చ‌ర్య‌లు తీసుకునేలా డైన‌మిక్ ఇంజ‌క్ష‌న్ ఆర్డ‌ర్ ఇవ్వాలంటూ ఆహా యాజ‌మాన్యం కోర్టుని రిక్వెస్ట్ చేసింది. జ‌స్టిస్ సంజీవ్ స‌చ్‌దేవ్ కేసుని ప‌రిశీలించి త‌దుప‌రి విచార‌ణ వ‌ర‌కు మ‌ధ్యంత‌ర ఇంజెక్ష‌న్‌ను జారీ చేస్తున్న‌ట్లు తెలియ‌జేసింది. అప్ప‌టి వ‌ర‌కు అన్‌స్టాప‌బుల్‌కు సంబంధించి అన‌ధికారికంగా ఉన్న లింకులు తొల‌గించాల‌ని టెలికమ్యూనికేష‌న్ అండ్ ఎల‌క్ట్రానిక్స్ మినిష్ట‌రీకి, ఇంట‌ర్నెట్ ప్రొవైడ‌ర్స్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశాల‌ను ఇచ్చింది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×