BigTV English

Modi: ‘లంచం వద్దు’.. ‘అబ్బాస్ ముద్దు’.. అమ్మ గురించి మోదీ..

Modi: ‘లంచం వద్దు’.. ‘అబ్బాస్ ముద్దు’.. అమ్మ గురించి మోదీ..

Modi Mother: చాయ్ వాలా ప్రధాని అయ్యారు. పేద కుటుంబంలో జన్మించిన మోదీ అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారు. మరకలేని మంచి మనిషిగా ముద్ర వేసుకున్నారు. అవినీతికి తావు లేకుండా.. అక్రమార్జన వెనకేసుకోకుండా.. మిస్టర్ క్లీన్ గా నిలిచారు. సింపుల్ అండ్ హంబుల్ లివింగ్. పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగినా.. అమెరికా పర్యటనలోనూ ఉపవాస దీక్ష చేసినా.. అది ఆయన గొప్పతనమే. ఆ విలువలతో కూడిన జీవితం తన తల్లి నుంచే వచ్చిందంటారు మోదీ. అమ్మ అంత్యక్రియల్లో పాల్గొన్న కొన్నిగంటల్లోనే ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించి.. విధుల పట్ల తన నిబద్ధతను చాటారు ప్రధాని. కాస్త సమయం చిక్కితే.. తల్లి హీరాబెన్ తో ఉన్న జ్ఞాపకాలను బ్లాగ్‌లో వివరించారు. అవి ఆయన మాటల్లోనే….


మోదీ: “మేం వాద్‌నగర్‌లో చిన్న పెంకులతో కూడిన మట్టింట్లో ఉండేవాళ్లం. నిత్యం ఎన్నో కష్టాలు. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఇంటి పైకప్పు నుంచి వర్షం కురిసేది. ఆ నీళ్లను పట్టుకునేందుకు అవి కారే చోట బకెట్లు, గిన్నెలు ఉంచేది. కుటుంబ ఖర్చుల కోసం అమ్మ సమీపంలోని కొన్ని ఇళ్లలో పాత్రలు కూడా కడిగేవారు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా.. ఆమె ఎన్నడూ వెనకడుగు వేయలేదు.”

మోదీ: “అమ్మ ఎంతో శుభ్రత పాటించేవారు. పరిశుభ్రత విషయంలో ఆమె ఖచ్చితంగా ఉండేవారు. వాద్‌నగర్‌లో మా ఇంటి సమీపంలోకి ఎవరైనా పారిశుద్ధ్య కార్మికులు వస్తే.. వారిని ఇంట్లో టీ తాగకుండా వెళ్లనిచ్చేవారు కాదు. చాలా విశాల హృదయురాలు ఆమె. ఒకసారి నాన్న ప్రాణస్నేహితుడు చనిపోతే.. వారి కుమారుడు అబ్బాస్‌ను మా ఇంటికి తీసుకొచ్చారు. అతను మాతోనే ఉండి చదువు పూర్తి చేశారు. నా తోబుట్టువులతో సమానంగా అబ్బాస్‌ను అమ్మ ప్రేమగా చూసేవారు.”


మోదీ: “అమ్మ జీవిత ప్రయాణం ఓ తపస్సులాంటిది. చిన్ననాటి నుంచే ఎన్నో కష్టాలను చవిచూసింది. సామాన్య ఇల్లాలిగా ఉంటూ.. పెంకుటింట్లో తమను పెంచి.. జీవిత పాఠాలు నేర్పించారు. విలువలతో కూడిన నిస్వార్థ జీవితం ఆమెది. భారత ప్రధానిగా ఎదిగే క్రమంలో అమ్మ చూపిన ప్రభావం ఎంతో ఉంది.”

మోదీ: “2001లో గుజరాత్‌ సీఎంగా మొదటిసారి బాధ్యతలు తీసుకునే ముందు అమ్మ ఆశీర్వాదం కోసం వెళ్లాను. ఆ సమయంలో నన్ను ఎన్నడూ లంచం తీసుకోవద్దని అమ్మ చెప్పడం నాకు బాగా గుర్తు.”

మోదీ: “భారతీయ మాతృమూర్తిలో ఉండే తపస్సు, నిస్వార్థం, సేవాతత్వాన్ని అమ్మ జీవితంలో చూశాను. అమ్మతోపాటు ఆమెలాంటి కోట్ల మంది మహిళలను చూసినప్పుడు.. భారత మహిళకు ఏదీ అసాధ్యం కాదనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. పేదల సంక్షేమం కోసం పనిచేయాలనే తపన, స్ఫూర్తి ఆమె నుంచే వచ్చిందేపేదల సంక్షేమం కోసం పనిచేయాలనే తపన, స్ఫూర్తి ఆమె నుంచే వచ్చిందే.”

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×