BigTV English
Advertisement

Salaar: య‌ష్‌ని మించి ప్రభాస్ కోసం ఖ‌ర్చుపెడుతున్నారా?

Salaar: య‌ష్‌ని మించి ప్రభాస్ కోసం ఖ‌ర్చుపెడుతున్నారా?

Salaar:ఇవాళ్టికీ ఇండియ‌న్ మూవీ హ‌య్య‌స్ట్ క‌లెక్ష‌న్లు బాహుబ‌లి2 మీదే ఉన్నాయి. కేజీయ‌ఫ్ ఫ‌స్ట్ పార్టుతో పోలిస్తే సెకండ్ పార్టు నాలుగు రెట్లు ఎక్కువ క‌లెక్ట్ చేసి ఉండొచ్చు. కానీ బాహుబ‌లి2ని మాత్రం దాట‌లేక‌పోయింది. అందుకే ఈ విష‌యం మీద గ‌ట్టిగా ఫోక‌స్ చేశారు హోంబ‌లే ఫిలిమ్స్. ఈ సంస్థ నిర్మించిన గ‌త చిత్రాలు కేజీయ‌ఫ్‌2క‌న్నా, కాంతార‌క‌న్నా ఎక్కువ బ‌డ్జెట్‌ని స‌లార్‌కి కేటాయించార‌ట‌. ఆ మాట కొస్తే ఇండియ‌న్ హిస్ట‌రీలో అత్యంత ఎక్కువ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నార‌ట‌. జ‌న‌వ‌రితో స‌లార్ షూటింగ్ పూర్త‌వుతుంది. 80 శాతం షూటింగ్ ఇప్పటికే పూర్త‌యింది. కానీ క్లైమాక్స్ మాత్ర‌మే మిగిలి ఉంది. దాన్ని జ‌న‌వ‌రిలో తెర‌కెక్కిస్తారు.
సెప్టెంబ‌ర్‌లో ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. అంటే దాదాపు ఆరు నెల‌ల‌కు పైగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ కి టైమ్ తీసుకుంటున్నారు.


ప్ర‌భాస్ ఫిగ‌ర్ క‌రెక్ష‌న్ కోస‌మే ఇంత టైమ్ తీసుకుంటున్నార‌నే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. స‌లార్‌లో ప్ర‌భాస్ తండ్రీకొడుకులుగా క‌నిపిస్తార‌ని టాక్‌. యంగ్ లుక్ కోసం ఫిగ‌ర్ క‌రెక్ష‌న్‌కి విజువ‌ల్ ఎఫెక్ట్స్ కి టైమ్ ప‌డుతుంద‌నే మాట‌లు వినిపిస్తున్నాయి. దాంతో పాటు ఎక్కువ భాగం గ్రీన్ మ్యాట్‌లో తీసేసి ఉంటార‌ని, దానికి దుమ్మూ ధూళీ, యాంబియ‌న్స్ జోడించ‌డానికి అంత స‌మ‌యం ప‌డుతుంద‌ని కూడా అంటున్నారు జ‌నాలు. నెక్స్ట్ ఇయ‌ర్ మోస్ట్ ఎవెయిటెడ్ మూవీస్‌లో ప్ర‌భాస్ స‌లార్ ఉంది. అందులోనూ ప్ర‌శాంత్ నీల్ సినిమా కోసం ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఫ్యాన్స్ వెయిటింగ్‌లో ఉన్నారు. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌శాంత్‌నీల్ కోసం స్టార్ హీరోలు కూడా క్యూలో ఉన్నారు. అదీ సంగ‌తి.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×