E-Paper
Advertisement

Upcoming Movies: రిపబ్లిక్‌ డేకి.. థియేటర్‌/ ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే..!

Upcoming Movies: రిపబ్లిక్‌ డేకి.. థియేటర్‌/ ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే..!
Advertisement

Upcoming Movies: ప్రేక్షకులను అలరించేందుకు ప్రతివారం థియేటర్, ఓటీటీలో పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అటు బాక్సాఫీసు వద్ద సత్తా చాటుకున్న మూవీలు కూడా ఓటీటీలో చిన్న సినిమాలతో పోటీ పడతాయి. అయితే సంక్రాంతి తర్వాత మరోసారి సినీ ప్రేక్షకులను అలరించేందుకు ఆసక్తికర చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ రిపబ్లిక్ డే సందర్భంగా వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో తెలుసుకుందాం.

థియేటర్లలో అలరించే సినిమాలు..

Advertisement

హృతిక్ రోషన్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఫైటర్’. ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం జనవరి 25న థియేటర్లలో రిలీజ్ కానుంది.

మోహన్ లాల్ కథానాయకుడిగా, లిజో జోస్ పెలిసెరీ దర్శకత్వం వహిస్తోన్న కొత్త చిత్రం ‘మలైకోటై వాలిబన్’. ఇందులో మోహన్‌లాల్ ఓటమెరుగని రెజ్లర్ వాలిబన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

ధనుష్, ప్రియాంక మోహన్ జంటగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా తమిళంలో రిలీజైన ఈ చిత్రం తెలుగులో జనవరి 25న ప్రేక్షకులను అలరించనుంది.

ఈసారి సంక్రాంతికి తమిళంలో సందడి చేసిన మరొక సినిమా ‘అయలాన్’. శివ కార్తికేయన్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించారు. ఆర్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఒకే ఒక్క పాత్రతో రూపొందిన సినిమా ‘105’. హీరోయిన్ హన్సిక ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి రాజు దుస్సా దర్శకత్వం వహించారు. ఈ సినిమా జనవరి 26న విడుదల కానుంది.

ఈ సినిమాలతో పాటు ‘మూడో కన్ను’, ‘రామ్‌: రాపిడ్‌ యాక్షన్ మిషన్‌’, ‘బిఫోర్‌ మ్యారేజ్‌’, ‘ప్రేమలో..’ తదిర చిత్రాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.

ఈ వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!

నెట్‌ఫ్లిక్స్‌

క్వీర్‌ ఐ (వెబ్‌సిరీస్‌ )జనవరి 24
సిక్స్‌ నేషన్స్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 24
యానిమల్‌ (హిందీ/తెలుగు) జనవరి 26 (అధికారిక ప్రకటన రావాల్సి ఉంది)
బ్యాడ్‌ల్యాండ్‌ హంటర్స్‌(కొరియన్‌) జనవరి 26

అమెజాన్‌ ప్రైమ్‌

హస్లర్స్‌ (హిందీ) జనవరి 24
పంచాయత్‌ (హిందీ) జనవరి 26

జీ5

శామ్‌ బహదూర్‌ (హిందీ) జనవరి 26

డిస్నీ+హాట్‌స్టార్‌

నేరు (మలయాళం) జనవరి 23
కర్మా కాలింగ్‌ (హిందీ) జనవరి 26
ఫ్లెక్స్‌ ఎక్స్‌ కాప్‌ (కొరియన్‌) జనవరి 26
ఫైట్‌ క్లబ్‌ (తమిళం) జనవరి 27

సోనీలివ్‌

షార్క్‌ ట్యాంక్‌ ఇండియా (హిందీ) జనవరి 22

బుక్‌ మై షో

వోంకా (హాలీవుడ్‌) జనవరి 22
ఆక్వామెన్‌2 (హాలీవుడ్‌) జనవరి 23
ఫియర్‌ (హాలీవుడ్) జనవరి 23

యాపిల్‌ టీవీ ప్లస్‌

మాస్టర్స్‌ ఆఫ్‌ ది ఎయిర్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 26

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×