BigTV English

Urvashi Rautela : దబిడి డబిడి సాంగ్ కు హాట్ బ్యూటీ రెమ్యునరేషన్.. మాస్ సాంగ్ కు కోట్లు?

Urvashi Rautela : దబిడి డబిడి సాంగ్ కు హాట్ బ్యూటీ రెమ్యునరేషన్.. మాస్ సాంగ్ కు కోట్లు?

Urvashi Rautela : ఒక సినిమాను రెండున్నర, మూడు గంటల పాటు థియేటర్లలో చూడటం మాటలు కాదు. సినిమా స్టోరీ బాగుంటే తప్ప సినిమాను చూడటం బోర్.. అందుకే స్టోరీతో సంబంధం లేకుండా వచ్చే ఐటమ్ సాంగ్స్ మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో ఐటమ్ సాంగ్స్ కు యూత్ నీరాజనం పలుకుతున్నారు.. సాంగ్స్ మాత్రమే కాదు సాంగులో కనిపించే ఐటమ్ పాపలు కూడా బాగా కాస్ట్ గురు.. భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమాలల్లో ఐటమ్ సాంగ్స్ కు బాగా డిమాండ్ ఉంటుంది. అందులో కనిపించేవారికి కోట్లు ముట్టచెబుతున్నారు. ఇక తాజాగా డాకు మహరాజ్ కోసం ఊర్వశి రౌతేలా తీసుకున్న రెమ్యూనరేషన్ విని నోర్లు వెళ్ల బెడుతున్నారు. ఈ అమ్మడు ఈ పాటకు ఎంత తీసుకుందో ఒకసారి చూద్దాం..


టాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ కు మంచి డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే.. హీరోయిన్లు సైతం ఐటమ్ సాంగ్స్ చేశారు. ఇప్పటివరకు సమంత, కాజల్, తమన్నా, శృతి హాసన్ వంటి హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ లో మెరిశారు. ఇక ఈ మధ్య స్టార్ హీరోల సినిమాల్లో ఊర్వశి రౌతేలా పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఈమె ఐటమ్ సాంగ్ చేసిన సినిమాలు మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి. ఇకపోతే ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ – బాబీ కాంబినేషన్‌లో వస్తున్న డాకు మహారాజ్ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేలా ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. దబిడి దిబిడి అంటూ సాగే ఈ సాంగ్‌లో ఆమె నడుము, పిరుదు భాగాలను టచ్ చేస్తూ బాలయ్య వేసిన స్టెప్స్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. అయినా ఈ సాంగ్ కు క్రేజ్ పెరుగుతుంది.. యూట్యూబ్ లో అయితే దూసుకుపోతుంది. ఇక ఈమె రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ అవుతుంది.

ఈ పాట కోసం ఊర్వశి తీసుకున్న పారితోషికం నెట్టింట చర్చనీయాంశమైంది. దబిడి దిబిడి పాటలో నర్తించినందుకు గాను ఆమె అక్షరాల రూ. కోటి కి పైగా పారితోషికం అందుకున్నట్లుగా ఫిలింనగర్‌లో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.. సాంగ్ సూపర్ హిట్ టాక్ ను అందుకుంది. మరి రెండు కోట్లు ఇచ్చిన ఆశ్చర్య పోనవసరం లేదని ఫ్యాన్స్ అంటున్నారు.. ఈమెకే ఇంత ఇస్తే హీరోయిన్లుగా చేసిన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్‌లకు మేకర్స్ ఎంత ఇచ్చారోనంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.. ఇక ఈ మూవీ ట్రైలర్ ను ఇటీవలే రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి వారి అంచనాలను రీచ్ అయ్యేలా బాబీ డైరెక్ట్ చేశారేమో చూడాలి.. ఈ మూవీ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 మూవీ రాబోతుంది.. ఆ మూవీని గత ఏడాది లాంచ్ చేశారు. భారీ యాక్షన్ తో స్టోరీ ఉండబోతుందని ఫిలింనగర్ లో టాక్..


Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×