Indian Railways: భారతీయ రైల్వే సంస్థ కొత్త టైమ్ టేబుల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జనవరి 1 నుంచి పలు రైళ్ల టైమింగ్స్ లో మార్పులు చేర్పులు చేసింది. కొత్త టైమ్ టేబుల్ ప్రకారం ప్రయాణీకులు తమ ప్రయాణాలను కొనసాగించాలని సూచించింది. అయితే, చాలా మంది ప్రయాణీకులు కొత్త టైమ్ టేబుల్ వచ్చిందనే విషయాన్ని మర్చిపోతున్నారు. పాత టైమింగ్స్ ను ఫాలో అవుతున్నారు. అదే టైమ్ ప్రకారం రైళ్లు ఎక్కుదామని స్టేషన్లకు వస్తున్నారు. అయితే, అప్పటికే తాము ఎక్కాల్సిన రైళ్లు వెళ్లిపోయాయని తెలిసి తెలిసి షాక్ అవుతున్నారు.
కాకినాడలో ప్రయాణీకుల ఆందోళన
తాజాగా కాకినాడ- షిర్డీ ఎక్స్ ప్రెస్ విషయంలోనూ ఇలాగే జరిగింది. చాలా మంది ప్రయాణీకులు పాత టైమింగ్ ప్రకారం స్టేషన్ కు చేరుకున్నారు. కానీ, అప్పటికే రైలు వెళ్లిపోయిందని తెలిసి ఆందోళన చెందారు. కొత్త టైమ్ టేబుల్ ప్రకారం కాకినాడ పోర్ట్-షిర్డీ సాయి నగర్ రైలు టైమింగ్ మారింది. జనవరి 1 నుంచి కాకినాడ పోర్ట్-షిర్డీ సాయి నగర్ ఎక్స్ ప్రెస్ కాకినాడలో 5 గంటలకే బయల్దేరేలా మార్చారు. ఇవాళ కూడా 5 గంటలకే రైలు బయల్దేరింది. కానీ, చాలా మంది షిర్డీ వెళ్లాల్సిన ప్రయాణీకులు 6 గంటలకు రైలు వస్తుందని స్టేషన్ కు వెళ్లారు. అప్పటికే రైలు వెళ్లడంతో రైల్వే అధికారులకు కంప్లైట్ చేశారు.
రాజమండ్రిలో 3 గంటల పాటు రైలు నిలిపివేత
ప్రయాణీకుల ఆందోళనతో రైల్వే అధికారులు కాకినాడ పోర్ట్-షిర్డీ సాయి నగర్ రైలును రాజమండ్రి స్టేషన్ లో సుమారు 3 గంటల పాటు ఆపేశారు. కాకినాడ, సామర్లకోటలో రైలు ఎక్కలేకపోయిన వారిని, శేషాద్రి ఎక్స్ ప్రెస్ లో రాజమండ్రికి తీసుకొచ్చారు. అక్కడ వాళ్లంతా షిర్డీ ఎక్స్ ప్రెస్ రైల్లోకి ఎక్కడంతో ట్రైన్ అక్కడి నుంచి బయల్దేరి వెళ్లింది. ఈ గందరగోళం నేపథ్యంలో విజయవాడ రైల్వే జంక్షన్ అధికారులు షిర్డీ ఎక్స్ ప్రెస్ రైలు టైమింగ్స్ కు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. రైలు టైమింగ్స్ మారిన విషయాన్ని గమనించి, వాటికి అనుగుణంగా ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు మారిన టైమింగ్స్ వివరాలను మరోసారి వెల్లడించారు.
Changes in Time table of
1. Train no. 17206 Kakinada Port- Shirdi Exp
2. Train no. 17208 Machilipatnam- Shirdi Exp
w.e.f 01.01.2025Passengers are kindly requested to check the revised timings and services before planning their journeys. Passengers are requested to access the… pic.twitter.com/egWKJA8pI2
— DRM Vijayawada (@drmvijayawada) January 6, 2025
కాకినాడ పోర్ట్-షిర్డీ సాయి నగర్ ఎక్స్ ప్రెస్
ఈ రైలు కాకినాడ పోర్టు నుంచి 5.05 గంటలకు బయల్దేరుతుంది. కాకినాడ టౌన్ కు 5.15కు చేరుకుంటుంది. సామర్లకోటకు 5.30, రాజమండ్రికి 6.05, నిడదవోలు 6.30, తాడేపల్లిగూడెం 6.45, ఏలూరు 7.30, విజయవాడకు 9.10 గంటలకు చేరుకుంటుంది.
మచిలీపట్నం- షిర్డీ సాయి నగర్ ఎక్స్ ప్రెస్
అటు మచిలీపట్నం- షిర్డీ నగర్ ఎక్స్ ప్రెస్ ఉదయం 6.50 గంటలకు మచిలీపట్నం నుంచి బయల్దేరుతుంది. పెడన 7:00, గుడ్లవల్లేరు 7.15, గుడివాడ 7.35, విజయవాడ 9.10 గంటలకు చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు.
Read Also: ఇకపై చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు చేసే రైళ్లు ఇవే.. చెక్ చేసుకోండి!
ఇకపై ప్రయాణీకులు కొత్త టైమింగ్స్ ను ఫాలో కావాలని రైల్వే అధికారులు సూచించారు. పాత టైమింగ్స్ ప్రకారం వస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని వెల్లడించారు.
Read Also: ప్రయాణీకుల ఆందోళన.. నిలిచిపోయిన రైలు, ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?