Hyderabad News: హైదరాబాద్ శివారులో రాచకొండ కమిషనరేట్ ఘట్కేసర్ పీఎస్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓఆర్ఆర్ పక్కన సర్వీస్ రోడ్‌లో కాసేపటి క్రితమే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రన్నింగ్ కారులో భారీగా మంటలు చెలరేగాయి.
ఘట్కేసర్ నుంచి గణపురం మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు పక్కన సర్వీస్ రోడ్డుపై వెళ్తున్న వాహనంలో మంటలు భారీగా చెలరేగడంతో. మంటలో కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. అయితే కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మంటలో నుంచి తప్పించుకోబోయే తగలబడతూ పక్కనే ఉన్న ఫుట్ పాత్ పై పడి మృతిచెందాడు.
Also Read: Pushpa 2 Collections :బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేసిన పుష్ప2.. ఎన్నో స్థానం అంటే..?
దగ్ధమవుతున్న కారులో మృతిచెందిన వారిని ఉప్పల్ వాసులుగా గుర్తించారు. కారులో సీఎన్జీ సిలిండర్ ఉండటంతో పోలీసులు ఎవరిని దగ్గరికి రానివ్వడం లేదు. కారు వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.