BigTV English

Varalakshmi Sarath Kumar: సైకలాజికల్ కాన్సెప్ట్ తో వరలక్ష్మి తెలుగు సినిమా.. డైరెక్టర్ ఎవరంటే..?

Varalakshmi Sarath Kumar: సైకలాజికల్ కాన్సెప్ట్ తో వరలక్ష్మి తెలుగు సినిమా.. డైరెక్టర్ ఎవరంటే..?

Varalakshmi Sarath Kumar: వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarath kuma) .. జూనియర్ రమ్యకృష్ణ (Ramyakrishna) గా పేరు దక్కించుకున్న ఈమె, తన అద్భుతమైన నటనతో తెలుగు సినీ పరిశ్రమకు దొరికిన ఆణిముత్యం అని చెప్పవచ్చు. కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ (Sarath Kumar) కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వరలక్ష్మి శరత్ కుమార్.. అక్కడ హీరోయిన్గా పలు చిత్రాలు చేసింది. కానీ ఆ సినిమాలు ఏవీ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాలో విలన్ గా నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. ఆ తర్వాత స్టార్ హీరోలు అందరి సినిమాలలో విలన్ గా నటించి మెప్పించింది వరలక్ష్మీ శరత్ కుమార్. ప్రశాంత్ వర్మ (Prashanth varma) దర్శకత్వంలో తేజ సజ్జ(Teja sajja) నటించిన ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా సెలబ్రిటీ అయిపోయింది. ముఖ్యంగా హీరో స్టేటస్ ని బట్టి కాకుండా తన పాత్రకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ పలువురు హీరోల సినిమాలలో నటించి భారీ పాపులారిటీ అందుకుంది.


సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్ సబ్జెక్టుతో రానున్న వరలక్ష్మి..

విలన్ గానే కాకుండా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా సైకలాజికల్ థ్రిల్లర్ యాక్షన్ మూవీలో చేయబోతుందని సమాచారం. ఈ క్రమంలోనే ‘ఆదిపర్వం’ సినిమా డైరెక్టర్ సంజీవ్ మేగోటి (Sanjeev megoti kumar) రాసుకున్న సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సబ్జెక్టు కోసం వరలక్ష్మీ శరత్ కుమార్ ఎంపిక చేయబడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వరలక్ష్మి శరత్ కుమార్ ఇందులో లీడ్ రోల్ పోషిస్తూ ఉండగా.. భారీ బడ్జెట్ తో డైరెక్టర్ సంజీవ్ మేగోటి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట. ఇకపోతే సంజీవ్ మేగోటి దర్శకత్వంలో వరలక్ష్మీ శరత్ కుమార్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.


వరలక్ష్మి శరత్ కుమార్ కెరియర్..

ఇటీవల వరలక్ష్మి తాను ప్రేమించిన నికోలయ్ సచ్ దేవ్ ను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే.. 1985 మార్చి 5న శరత్ కుమార్ (Sarath Kumar)- ఛాయా (Chaya) దంపతులకు జన్మించింది. ప్రముఖ నటి రాధిక (Radhika) ఈమెకు సవతి తల్లి. చెన్నైలోని సెయింట్ మైకేల్స్ అకాడమీలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఈమె, ఆ తర్వాత చెన్నైలోని హిందుస్థాన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుండి మైక్రో బయాలజీలో డిగ్రీ పూర్తి చేసింది. ఇక యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ పూర్తి చేసిన వరలక్ష్మీ శరత్ కుమార్ ముంబైలోని అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్లో నటనలో శిక్షణ కూడా తీసుకుంది. 2012లో తమిళంలో విడుదలైన ‘పోడాపోడి’ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ తెలుగు, తమిళ్ మలయాళం భాషల్లో నటిస్తూ బిజీగా మారింది. వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.ఇక 2021లో ‘క్రాక్’ సినిమాకి గానూ ఉత్తమ సహాయ నటిగా సైమా అవార్డు అందుకుంది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×