BigTV English

Rana Daggubati : రానాకు ఘోర అవమానం.. హీరోయిన్ వల్ల పరువు మొత్తం పాయే..

Rana Daggubati : రానాకు ఘోర అవమానం.. హీరోయిన్ వల్ల పరువు మొత్తం పాయే..

Rana Daggupati:  టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. దగ్గుబాటి వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కూడా తన టాలెంట్ తో సూపర్ హిట్ మూవీలలో నటించారు. అంతే కాదు పలు ప్రత్యేకమైన కార్యక్రమాల్లో కూడా హోస్ట్ గా వ్యవహరించిన అందరికి తన మాటలతో ఆకట్టుకున్నాడు. ఇక ఈయన ఈ మధ్య ఇండస్ట్రీకి సంబందించిన పలు షోలకు వ్యాఖ్యత్తగా వ్యవహారించారు. ఇటీవల ఐఫా అవార్డుల వేడుక దుబాయ్ లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.. ఈ ఈవెంట్ కు తెలుగు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు.. ఆ అవార్డు వేడుకలో తెలుగు సినిమాలకే ఎక్కువ అవార్డులు వచ్చాయన్న విషయం తెలిసిందే.. అయితే ఈ ఐఫా వేడుకలో వరలక్ష్మి శరత్ కుమార్ కు అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.. అప్పుడు రానా వరలక్ష్మి మధ్య జరిగిన కన్వీర్జెషన్ ఫన్నీగా అనిపించింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ప్రతిష్ఠాత్మక ఐఫా 2024 పురస్కారాల వేడుక ఇటీవల అబుదాబిలో ఘనంగా జరిగింది. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి పలువురు అగ్రతారలు హాజరయ్యారు. 2024కు గాను అవుట్‌ స్టాండింగ్‌ అచీవ్‌మెంట్‌ ఇన్‌ ఇండియన్‌ సినిమా పురస్కారాన్ని చిరంజీవి అందుకున్నారు. నందమూరి బాలకృష్ణ ఐఫా గోల్డెన్‌ లెగసీ పురస్కారాన్ని స్వీకరించారు. ఐఫా ఉమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారం సమంతకు దక్కింది. దసరా చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా నాని, ఉత్తమ విలన్‌గా షైన్‌ టామ్‌ చాంకో అవార్డులు అందుకున్నారు. అలాగే ఉత్తమ సహాయ నటి – వరలక్ష్మి శరత్‌కుమార్‌ అందుకున్నారు.. ఈ అవార్డు ను అందుకున్న తర్వాత రానా మాట్లాడుతూ నీ పెళ్ళికి అందరిని పిలిచావు నన్ను తప్ప అన్నాడు. దానికి ఆమె సమాధానం చెబుతూ నీ పెళ్ళికి నన్ను పిలవలేదు అందుకే పిలవలేదు. ఎందుకు పిలవాలి అన్నట్లు సమాధానం చెప్పింది. ఆ మాటతో అందరు పల్లున నవ్వారు.. రానా పరువును ఒక్కమాటతో తీసేసింది. ఇక ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

ఇక రానా కేరీర్ విషయానికొస్తే.. ఈ హీరో ప్రస్తుతం సినిమాల్లో నటించడం కన్నా సినిమాలకు నిర్మాతగా వ్యవహారిస్తున్నాడు. ఇటీవల ఆయన నిర్మించిన సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక సంక్రాంతి బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ హనుమాన్ కు సీక్వెల్ గా జై హనుమాన్ రాబోతుండు.. ఈ సినిమాలో హీరో రిషబ్ శెట్టితో పాటు మరో హీరో కూడా నటిస్తున్నాడని తెలుస్తోంది. అది ఎవరో కాదు.. రానా దగ్గుబాటి. జై హనుమాన్ సినిమాలో రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నాడని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం.. ప్రస్తుతం రిషబ్‌ శెట్టి, రానా దగ్గుబాటి, ప్రశాంత్‌ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోను ప్రశాంత్ వర్మ షేర్ చేయడంతో పాటు యూనివర్స్‌ ఇన్‌స్టా హ్యాండిల్స్‌ను ట్యాగ్ చేశారు. దీంతో జై హనుమాన్ లో రానా ఉండబోతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.


Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×