BigTV English
Advertisement

OTT Movie : భార్య మాజీ లవర్ అని తెలీక చెల్లికిచ్చి పెళ్లి చేయాలనుకునే హీరో…

OTT Movie : భార్య మాజీ లవర్ అని తెలీక చెల్లికిచ్చి పెళ్లి చేయాలనుకునే హీరో…

OTT Movie : మలయాళం మూవీస్ కు రోజు రోజుకి క్రేజ్ పెరిగిపోతోంది. మంచి ఫీల్ గుడ్ కంటెంట్ తో ఈ మూవీస్ ను తర్కెక్కిస్తున్నారు దర్శకులు. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ వరకు మలయాళం ఇండస్ట్రీ ఎదిగింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో కడుపుబ్బ నవ్వించి థియేటర్లలో మంచి విజయాన్ని సాధించి ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఒక మలయాళం మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.


రెండు ఓటీటీ లలో 

కడుపుబ్బ నవ్వించే ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ పేరు “గురువాయూర్ అంబల నాదయిల్” (Guruvayoor Ambalanadayil) ఈ మూవీలో హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి వేరొకరిని పెళ్లి చేసుకొని వెళ్లిపోతుంది. హీరో మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతుండగా అతనికి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. చాలా సరదా సన్నివేశాలతో మూవీ లవర్స్ ను ఈ మూవీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ మూవీ  హాట్ స్టార్ (Hotstar), సింప్లీ సౌత్ (simply south) ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరో పార్వతి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి కూడా హీరోని ఇష్టపడుతుంది. అయితే పార్వతి అతనికి చెప్పకుండా వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. ఈ విషయం తెలిసి పార్వతి మీద కోపం పెంచుకొని హీరో బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ తల్లిదండ్రులు అంజలి అనే అమ్మాయితో పెళ్లి కుదురుస్తారు. ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఆనంద్ తో హీరో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఎంతలా అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందేమో అన్నంతలా అతనితోనే మాట్లాడుతూ ఉంటాడు. ఆనంద్ తన భార్యకు ఎవరో  లెటర్ రాశారని అనుమానంతో ఆమెతో గొడవ పడగా, ఆమె పుట్టింటికి వెళ్ళిపోతుంది. హీరో ఆనంద్ తో మాట్లాడుతూ, నా పెళ్లికి వదినను కూడా తీసుకురావాలని చెప్తాడు. అయితే ఆనంద భార్య ఎవరో కాదు, ఒకప్పుడుహీరోని ప్రేమించిన అమ్మాయి. ఈ విషయం వీళ్ళిద్దరికీ తెలియకపోవడంతో వీరిద్దరికి మంచి బాండింగ్ ఉంటుంది.

ఆ తర్వాత హీరో పెళ్లికి పార్వతిని ఆనంద్ తీసుకొని వస్తాడు. అప్పుడు అతనికి అర్థమవుతుంది ఆనంద్ భార్య ఎవరో కాదు నేను ప్రేమించిన అమ్మాయి అని. ఈ విషయం ఆనంద్ తో చెప్పలేక తనకు తానే సతమతమవుతూ పెళ్లిని రద్దు చేసుకునే  ప్రయత్నం చేస్తాడు. అయితే అతని ప్రయత్నాలు విఫలం అవుతూ ఉంటాయి. ఒకసారి ఆనంద్ కి వీరిద్దరి విషయం తెలుస్తుంది. అప్పుడు ఆనంద్ హీరోని ఏం చేస్తాడు? ఆనంద్ చెల్లిని హీరోకి ఇచ్చి పెళ్లి చేస్తాడా? వీరిద్దరూ శత్రువులుగా మారుతారా? హీరో ఈ విషయాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీ చూస్తున్నంత సేపు నవ్వులలో మునగడం ఖాయం. ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. మైండ్ రిఫ్రెష్ మెంట్ కోసం అప్పుడప్పుడు ఇటువంటి మూవీస్ చూడటం చాలా బెటర్.

Related News

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : పసికూనను తింటేగానీ తీరని ఆకలి… సూపర్ హీరోలను ఈకల్లా పీకి పారేసే మాన్స్టర్… ఫుల్ యాక్షన్ ధమాకా

Baramulla OTT : పట్టపగలే పిల్లలు అదృశ్యం… కుమార్తె రూమ్ లో కుక్క వాసన… ఇంటెన్స్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్

The Bengal Files: ఓటీటీకి వివాదస్పద చిత్రం.. ‘ది బెంగాల్‌ ఫైల్స్‌’, ఎక్కడ చూడాలంటే!

OTT Movie : కళ్ళతో చూస్తే ఆత్మహత్య… ప్రపంచాన్ని తుడిచి పెట్టే మిస్టీరియస్ శక్తి… గ్రిప్పింగ్ థ్రిల్లర్… ఊహించని ట్విస్టులు

OTT Movie : దసరా ఉత్సవాలపై 40 నిమిషాల మూవీ…. ‘ప్రొద్దుటూరు దసరా’ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

OTT Movie : స్నేహితుడిని ఇంటికి ఆహ్వానిస్తే… ఒక్కొక్కరిని మట్టుబెడుతూ పని కానిచ్చే సైకో… గూస్ బంప్స్ తెప్పించే థ్రిల్లర్

Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!

Big Stories

×