BigTV English

Vishwak Sen : విశ్వక్ సేన్ పోస్ట్ .. అసలు కారణం ఇదేనా? నిర్మాత క్లారిటీ..

Vishwak Sen : విశ్వక్ సేన్ పోస్ట్ .. అసలు కారణం ఇదేనా?  నిర్మాత క్లారిటీ..

Vishwak Sen : ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన పోస్టులతో వైరల్ అయ్యే నటుడు విశ్వక్‌సేన్. రీసెంట్ గా అతను నటించిన మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ పై సోషల్ మీడియాలో స్పందించిన తీరు పలు రకాల విమర్శలకు దారి తీసింది. ప్రతిసారి మూవీ రిలీజ్ కి ముందు సోషల్ మీడియాలో ఇలా హడావిడి చేయడం విశ్వక్‌సేన్ కు అలవాటే అంటూ కొందరు ఈ పోస్ట్ పై కామెంట్స్ కూడా పెట్టారు. మరి ఇంతకీ ఈ మూవీ నిజంగానే పోస్ట్పోన్ అవుతుందా లేదా అన్న విషయంపై నిర్మాత క్లారిటీ ఇవ్వడం జరిగింది.


తాను నటించిన కొత్త సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ డిసెంబరు 9 విడుదల కావాల్సి ఉండగా.. మేకర్స్ దీని పోస్ట్పోన్ చేస్తున్నారు అన్న టాక్ రావడంతో హీరో విశ్వక్‌సేన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ పోస్ట్ పెట్టాడు. డేట్ మారిస్తే ప్రమోషన్ లో తాను కనపడను అంటూ ఈ పోస్టులో పేర్కొనడం జరిగింది. కావాలని ఈ మూవీని డేట్ మార్చడానికి కొందరు ఒత్తిడి తెస్తున్నారు అన్నట్లు అతను తన పోస్టులో రాశాడు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై నాగ వంశీ రెస్పాండ్ అయ్యారు.

నాగ వంశీ నిర్మాణంలో తెరకెక్కుతున్న మరొక చిత్రం ‘ఆదికేశవ’ మామూలుగా నవంబర్ 10న విడుదల కావాల్సి ఉంది .కానీ దాన్ని నవంబర్ 24 వాయిదా వేస్తున్నట్లు ప్రెస్ మీట్ పెట్టి నాగవంశీ వెల్లడించారు. దానితో పాటుగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ డేట్ గురించి విశ్వక్ పెట్టిన పోస్ట్ పై కూడా ఆయన స్పందించారు. మామూలుగా ఏ హీరో కైనా రిలీజ్ డేట్ వాయిదా పడుతుంది అంటే బాధ కలుగుతుంది.. ‘ఆదికేశవ’ మూవీ విషయంలో వైష్ణవ తేజ కూడా అలాగే ఫీలయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో హీరో ఆవేదన మనం అర్థం చేసుకోవాలి అని అన్నారు.


అయితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం రిలీజ్ డేట్ పై తుది నిర్ణయం తీసుకోలేదని.. ఈ మూవీకి సంబంధించిన ఒక పాటలో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ మిగిలి ఉందని.. అది పూర్తి అయిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తానంటూ నాగ వంశీ స్పష్టం చేశారు. నిజానికి డిసెంబర్ రెండవ వారం లో ఆపరేషన్ వాలంటైన్ మూవీ తో పాటు తమ మూవీ మాత్రమే వస్తుందని భావించారట. అయితే సడన్ గా ప్రభాస్ ‘సలార్’ రిలీజ్ కారణంగా హాయ్ నాన్న ,ఎక్స్ట్రా లాంటి సినిమాలు ప్రిపోన్ చేయడం జరిగింది. ఈ ఊహించని పరిణామంతో కాస్త ఇబ్బంది తలెత్తిందని.. ఈ నేపథ్యంలో గాంగ్స్ ఆఫ్ గోదావరి డిసెంబర్ 29కి రిలీజ్ చేయాలి అనుకుంటున్న మాట వాస్తవమే.. కానీ ఇంకా దాని గురించి పక్కా డెసిషన్ తీసుకోలేదని నాగ వంశీ అన్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×